Gossipsఅబ్బో..ఆ హీరోయిన్ల‌తో వెంక‌టేష్‌కు అదో రకమైన సంబంధం.. ఆ కథే వేరప్పా..?

అబ్బో..ఆ హీరోయిన్ల‌తో వెంక‌టేష్‌కు అదో రకమైన సంబంధం.. ఆ కథే వేరప్పా..?

దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగు సినిమా రంగంలో తమ‌దైన ముద్ర వేస్తున్నారు కుమారుడు దగ్గుబాటి వెంకటేష్. 1986లో కలియుగ పాండవులు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మూడున్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అంటేనే ఆయన నటన పట్ల ఎంత ఆశక్తి ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ల‌ను సొంతం చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో అంటే వెంకటేషే. ఈయనకు దాదాపు 75 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది. మొన్నటికి మొన్న వెంకీ మామ, ఎఫ్ 2 లాంటి సినిమాలతో విజయాలు అందుకున్న వెంకటేష్.. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. వెంకటేష్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన కెరీర్ లో ఎక్కువుగా ఇద్దరు హీరోయిన్లతో నటించడం..అలా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫిస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో..ఆ హీరోయిన్స్ కు ..వెంకటేష్ కు ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉన్నట్లు అప్పట్లో బాగా రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో సినీ ఇండస్ట్రీలో పుకార్లు బాగా వినిపించాయి. వెంకటేష్ ఎక్కువుగా మీనాతో, దివంగ‌త‌ హీరోయిన్ సౌందర్యతో ఎక్కువగా సినిమాలు చేశాడు.

వెంకటేష్ – మీనా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్ – దివంగ‌త‌ హీరోయిన్ సౌందర్య ది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లగా నిలిచాయి. వీళ్ల మధ్య ఆన్ స్క్రీన్ రొమన్స్ అదిరిపోవడంతో.. వీళ్ల మధ్య ఎదో సంబంధం ఉన్నట్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే వెంకటేష్ మాత్రం ఎప్పుడు దీని పై స్పందించలేదు. ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటూ..తన పని తాను చేసుకుంటూ హ్యాపిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news