Moviesఅప్పట్లో ఓ ఊపు ఊపేసిన ఈ భామ.. ఇప్పుడెలా ఉందో చూశారా..!!

అప్పట్లో ఓ ఊపు ఊపేసిన ఈ భామ.. ఇప్పుడెలా ఉందో చూశారా..!!

ఈ ఫోటో చూడగానే అందరికి గుర్తు వచ్చేది “దేవి: సినిమా. ఈమె పేరు కూడా చాలా మందికి తెలియదు.. అందరు ఈమెను దేవిగానే గుర్తు పెట్టుకున్నారు. అంతలా ఆ పాత్రలో మనల్ని కట్టిపడేసింది ప్రేమ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి ప్రేమ.. నిజానికి ఈమె కన్నడ నటి అయినా చూడగానే ఆకట్టుకునే రూపం, చక్కటి చిరునవ్వుతో తెలుగు అమ్మాయిలా కనిపించేవారు. వెంకటేష్ ‘ధర్మచక్రం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 1994 నుండి 2009 వరకు 15 ఏళ్ల పాటు నటిగా కొనసాగింది ఈమె. మోహన్ లాల్, విష్ణు వర్థన్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, సాయి కుమార్, మోహన్ బాబు, వెంకటేష్ వంటి స్టార్స్‌తో యాక్ట్ చేసిన ప్రేమ ‘దేవి’, ‘దేవిపుత్రుడు’ వంటి భక్తిరస చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కాలక్రమంలో నటనకు కనుమరుగయ్యారు.

కాగా ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్‌ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఇక 2017లో ఉపేంద్ర ‘మత్తే బా’ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కొంత గ్యాప్ తర్వాత కన్నడలో ఉపేంద్ర పక్కన ‘ఉపేంద్ర మాట్టే బా’ అనే సినిమాలో నటించారు. 2017 లో ఈ సినిమా విడుదలైంది. ‘ఢీ, చిరునవ్వుతో, నువ్వేకావాలి, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమతో రా, రాయలసీమ రామన్నచౌదరి’ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే రెండు తమిళ్, రెండు మలయాళ చిత్రాల్లోనూ కనిపించారు ప్రేమ.

ఇక చాలా కాలం తర్వాత ప్రేమ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రేమ రెండో వివాహం చేసుకోబోతున్నారని తల్లిదండ్రులు ఒత్తిడి మేరకు ఇంట్లో చూసిన సంబంధం చేసుకునేందుకు 44 ఏళ్ల వయసులో సిద్ధమయ్యారని సోషల్ మీడియాల్లో ప్రచారం సాగింది. అయితే ,తన మీద వస్తున్న వార్తలను కొట్టిపారేసింది నటి ప్రేమ. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. అలాగే తన ఆరోగ్యం మీద వస్తున్న వదంతులను నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news