Gossipsరంగమ్మత్త పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఖంగుతింటారు.....

రంగమ్మత్త పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఖంగుతింటారు.. నిజమండి..ఇది చూడండి..!!

అలనాటి నటి రాశీ గుర్తుంది కదా.. మర్చిపోయే నటా ఆమె.. సీనియర్‌ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తొంభైయవ దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన అందరిలా రాశి. రాశీ.. అప్పట్లో ఈమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశీ. ఈ అచ్చ తెలుగమ్మాయి రాశి.. 90వ దశకంలో హీరోయిన్ గా అడుగు పెట్టి.. అతి తక్కువ సమయంలోనే 50సినిమాల్లో నటించింది.. ఎంత తర్వగా కెరీర్ లో ఎదిగిందో.. అంతే త్వరగా స్క్రీన్ నుంచి కనుమరుగైపోయింది చిన్నది.

అయితే అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమె చరిత్ర సృష్టించగా స్టార్ హీరోలు కుర్రహీరోలు అనే తేడా లేకుండా నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది.తెలుగు హీరోయిన్ రాశి అనగానే అందరికి ఆమె చిరునవ్వే గుర్తుకు వస్తుంది. గ్లామర్ హీరోయిన్స్ హడావుడి ఎక్కువవుతున్న తరుణంలో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశి అప్పటి బ్యూటీలకు గట్టి పోటీని ఇచ్చింది. ఇక చాలా కాలం అనంతరం రాశి బుల్లితెరపై కూడా ప్రత్యేకమైన పాత్రలతో మెప్పిస్తోంది. ప్రస్తుతం జానకి కలగనలేదు సిరియల్ లో ఆమె చేస్తున్న పాత్ర శివగామి రేంజ్ లో క్లిక్కవుతోంది.

అయితే ఆమెకు రంగస్థలం సినిమాలో ముందు రంగమ్మత్త పాత్ర చేయమని అవకాశం వచ్చిందట. రాశిని చిత్ర యూనిట్ సంప్రదించారట. అయితే ఆమె ఈ పాత్ర చేయనని చెప్పారట దానికి కారణం కూడా ఉంది. ఈ సినిమాలో 1980 నాటి పల్లెవాతావరణంలో మహిళగా, మోకాళ్ల దాకా చీరకట్టుకుని పాత్ర చేయాలి అని చెప్పారు. అందుకే ఆమె ఈ పాత్ర వద్దు అనుకున్నారట. ఆతరువాత ఈ పాత్ర యాంకర్ అనసూయ చేసింది. ఇక తరువాత అను కెరీర్ ఎలా మారిపోయిందో ప్ర్త్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైన రాశి మంచి ఛాన్స్ మిస్ చేసుకుందనే అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news