Moviesశోభనం సీన్ అని చెప్పగానే జంప్..అలా సుమని పడగొట్టేసా..ఓపెన్ గా చెప్పేసిన...

శోభనం సీన్ అని చెప్పగానే జంప్..అలా సుమని పడగొట్టేసా..ఓపెన్ గా చెప్పేసిన రాజీవ్..!!

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కనకాల. ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ అంతా ముక్తకంఠంతో చెప్తుంటారు. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగమ్మాయిలు కూడా సిగ్గుపడేలా తెలుగును స్పష్టంగా పలుకుతుంది ఈమె. ప్రతీ ఇంటి అమ్మాయిలా కలిసిపోయింది సుమ. ఈమె మాటలకు పడిపోని వాళ్లంటూ ఉండరు. అటు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో తిరుగులేకుండా వెళ్తుంది సుమ.

కేరళ నుంచి వచ్చిన సుమ తెలుగు సీరియల్స్ లో మొదట దూరదర్శన్ లో నటించిన విషయ్మ్ తెలిసిందే. మీర్ దర్శకత్వంలో రూపొందించిన జీవన రాగం అనే సీరియల్లో రాజీవ్ కనకాల – సుమ ఇద్దరూ కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే రాజీవ్ ను పిలిచారట. అయితే సుమని చూసిన ఆయన ఇంకో రోజు పొడిగిస్తే బాగుంటుంది అనుకున్నారట. రాజీవ్ అనుకున్నట్లుగానే ఇంకో రోజు షూటింగ్ కొనసాగించారు.

మీర్ దర్శకత్వంలో వచ్చిన జీవనరాగం సీరియల్‌లో ఐదు రోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ ఉందట. ఇక అందులో వరుడిగా రాజీవ్ కనకాల.. వధువుగా ఓ వేరే అమ్మాయి నటించడానికి వచ్చిందట. అయితే శోభనం సీన్ అని చెప్పడంతో ఆ మరుసటి రోజు ఆమె షూట్ కి రాలేదట. దీంతో సీరియల్‌ బృందం సుమను పెళ్లి కూతురిగా తీసుకొచ్చి.. మళ్లీ మొదటి నుంచి షూట్ చేశారట. ఇక అక్కడ మన రాజీవ్ .. సుమ ను పడగొట్టాడట. అదే సమయంలో సుమకు ప్రపోజ్ కూడా చేశారట.

అయితే.. సుమ మాత్రం రాజివ్ కు నో చెప్పారట. దీంతో రాజీవ్ కు కళ్లలో నీళ్లు వచ్చేశాయట. బాగా ఏడ్చేశారట. ఆ మాటకు బాధపడిన రాజీవ్ ఆ తరువాత రెండు మూడు రోజులు సెట్‌లో ఆమెకు కనిపించలేదట. ఇక ఫైనల్ గా నాలుగో రోజు సెట్‌కు వెళ్లాడట..అప్పుడు సుమ ఆమె కారు తీసుకురాలేదట. అయితే ప్రొడక్షన్ వాళ్లు ఆటోలో పంపిస్తామని అంటే..అప్పుడు సుమ వద్దులేండి రాజీవ్ గారి కారు ఉందిగా.. అందులో వెళ్తాను లేండి అని చెప్పారట. అలా తమ ప్రేమ కథ మొదలైందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news