Moviesన‌య‌న‌తార కంటే ఆమె ప్రియుడు ఎంత చిన్నోడో తెలుసా..!

న‌య‌న‌తార కంటే ఆమె ప్రియుడు ఎంత చిన్నోడో తెలుసా..!

సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్లుగా ఉన్న స‌మంత – న‌య‌న‌తార కాంబోలో ఓ సినిమా ఎనౌన్స్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది త‌మిళ్‌లో తెర‌కెక్కుతున్నా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. కాతు వాకుల రెండు కాదల్ అనే టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడు. అటు స‌మంత‌, ఇటు న‌య‌న్ ఒకే సినిమాలో న‌టిస్తుండ‌డం అంటే అది పెద్ద ఐ ఫీస్టే. ఇక విజ‌య్ సేతుప‌తి మ‌రో ప్ల‌స్ అనుకుంటే… ఈ సినిమాను న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించ‌డం మ‌రో స్పెషాలిటీ..!

ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ కామెడీ అట‌. ఇక న‌య‌న్ – ఆమె ప్రియుడు విఘ్నేష్ కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ క్రేజీ సినిమాపై రోజుకో అప్‌డేట్ ఈ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు అడుగుతోన్న అనేక ప్ర‌శ్న‌ల‌కు న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ స్వ‌యంగా ఆన్స‌ర్లు ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే న‌య‌న్ వంట విష‌యంలో చాలా వీక్ అని చెప్పిన విఘ్నేష్ ఆమె ఘీ రైస్ చికెన్ చాలా బాగా వండుతుంద‌ని చెప్పాడు. ఇక న‌య‌న్ ఎక్క‌డ ఉంటే త‌న‌కు అక్క‌డ స్వ‌ర్గ‌మే అంటున్నాడు.

ఇక ఇద్ద‌రి వ‌య‌స్సు తేడా అన్న వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో చాలా మంది గూగుల్‌, వీకీపిడియా కూడా సెర్చ్ చేస్తున్నారు. నయన్ విగ్నేష్ కంటే 10నెలలు పెద్దదని తెలుస్తుంది. అదిగాక ఇదివరకు విగ్నేష్ కూడా ఓ సందర్బంలో నయన్ నాకంటే 10 నెలలు పెద్దదే అని చెప్పినట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. 10 నెల‌ల ఏజ్ గ్యాప్ అంటే పెద్ద లెక్క‌లోది కాదుగా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news