Moviesవిజయశాంతి కోసం బాలయ్య ఎంతటి త్యాగం చేసాడో తెలుసా..?

విజయశాంతి కోసం బాలయ్య ఎంతటి త్యాగం చేసాడో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ హిట్ జోడి అంటే బాలకృష్ణ, విజయశాంతి అనే చెప్పాలి. వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతి జోడికి మంచి క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరు కలిసి మొత్తంగా..17 చిత్రాల్లో జోడిగా నటించారు. ఇందులో మొదటి సారి బాలయ్య, విజయశాంతి ‘కథానాయకుడు’ సినిమాలో తొలిసారి హీరో,హీరోయిన్లుగా కలిసి నటించారు. చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో జోడిగా నటించారు.

1984లో కథానాయకుడు మూవీతో వీరిద్దరి కాంబినేషన్ స్టార్ట్ అయింది. సూపర్ హిట్ కొట్టి, సిల్వర్ జూబ్లీ గా నిలవడంతో ప్రతియేటా రెండు సినిమాలు రిలీజయ్యేవి. బాలయ్య సొంత సినిమా పట్టాభిషేకంలో వీరిద్దరూ కల్సి నటించిన రెండో సినిమా. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్యతో కల్సి విజయశాంతి కలిసి నటించిన తొలిసినిమా ముద్దుల క్రిష్నయ్య . ఇది బ్లాక్ బస్టర్ అయింది.

ఇక ముద్దుల మేనల్లుడు బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చి, మంచి హిట్ కొట్టింది. బి గోపాల్ డైరెక్షన్ లో పక్కా మాస్ కాంబినేషన్ లో వీరిద్దరూ కల్సి లారీ డ్రైవర్ సినిమాలో నటించారు. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో ఆటో రాణి గా మాస్ క్యారెక్టర్ చేసింది. సినిమా హిట్ అయింది.

రౌడీ ఇన్‌స్పెక్టర్‌ సినిమా ఎడిటింగ్‌ సమయంలో విజయశాంతి ఫైట్‌ తీసేస్తానని దర్శకుడు గోపాల్‌ బాలయ్యకు చెప్పాడు. అందుకు బాలయ్య బప్పుకోలేదు. అమ్మాయి కష్టపడి చేసిన ఫైట్‌ ను తీసేయడం కరెక్ట్ కాదని చెప్పాడు.కావాలంటే తన ఫైట్‌ తీసేయ్యండి అని చెప్పాడట. బాలయ్య ఉదార స్వభావం పట్ల గోపాల్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడట.అనుకున్నట్లుగానే సినిమాలో విజయశాంతి ఫైట్‌ ఉంచారు. సినిమా రిలీజై మంచి విజయం సాధించింది.

బొగ్గు గని కార్మికుడిగా బాలయ్య నటించిన నిప్పురవ్వ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా చేయగా, ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ ప్రొడ్యూసర్ కావడం విశేషం. ఈ సినిమా లేటవ్వడం, బంగారు బుల్లోడు రిలీజ్ కి బాలయ్య అనుమతి ఇవ్వడంతో బాలయ్య, విజయశాంతి మధ్య శతృత్వానికి దారితీసింది. దీని తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో మూవీ లేదు. 28ఏళ్లయినా ఇద్దరూ మళ్ళీ కల్సి నటించలేదు.

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగ ఉన్న విజయశాంతి.. గతేడాది మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే . ఈ మధ్యనే తనకు రాజకీయ జన్మనిచ్చిన బీజేపీలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news