Moviesఎఫైర్‌ ఉందని తెలిసి కూడా హీరోలను భర్తలుగా స్వీకరించిన స్టార్స్ వైఫ్స్...

ఎఫైర్‌ ఉందని తెలిసి కూడా హీరోలను భర్తలుగా స్వీకరించిన స్టార్స్ వైఫ్స్ వీళ్ళే..!!

సినిమా పరిశ్రమలో నటి నటుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఎపుడు సెన్సేషన్నల్ గానే ఉంటాయి. ఈ విషయంలో బాలీవుడ్‌లో మరీ ముందుంటుంది. ఎవరు ఎవరితో రేలేషన్ షిప్ లో ఉన్నారు అనేది ఆసక్తికరంగా ఉంటాయి. హీరో, హీరోయిన్స్ లో కూడా ఇలాంటి రెలేషన్స్ కామన్ గా కనిపిస్తుంటాయి.”ఆ హీరో హీరోయిన్‌ రిలేషన్‌లో ఉండేవారు. ఓ హీరో, హీరోయిన్ రిలేషన్‌లో ఉంటున్నారు” అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

ఓ సినిమాలో కలిసినటించినప్పుడు అభిప్రాయాలు, మనసులు కలుస్తాయి. అవి శారీరక సంబంధాలకు దారితీస్తుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా స్టార్‌ హీరోలను భర్తలుగా స్వీకరించి గొప్ప మనసుని చాటుకున్నారు స్టార్స్ వైఫ్స్. మరి వారెవరూ.. ఓ సారి లుక్కేయండి …

అమితాబ్‌ బచ్చన్‌-రేఖ:

అమితాబ్‌ బచ్చన్‌-రేఖ. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది వీరి ప్రేమ కథ. బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, రేఖ ప్రేమాయణం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా వారి మధ్య అఫైర్ నడిచింది.‘దో అన్‌జానే’ (1976) ఈ ఇద్దరికీ తొలి సినిమా. అప్పుడే ఒకరితో ఒకరికి పరిచయం కూడా. కానీ అప్పటికే రేఖ అమితాబ్‌ కంటే సీనియర్‌. ‘దో అన్‌జానే’సెట్స్‌ మీదే అమితాబ్‌ బచ్చన్‌గా పరిచయం అయ్యాడు.

పరిచయం కాస్త ప్రేమగా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇది ప్రేక్షకులకు తెగ నచ్చింది. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటపడింది అంటే 1978లో ‘గంగా కీ సౌగంద్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇందులోనూ రేఖ, అమితాబ్‌లే హీరోహీరోయిన్లు. అయితే అనుకొని పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ జయబాధురిని అమితాబ్ పెళ్లి చేసుకోవడంతో వారి మధ్య బ్రేకప్ జరిగింది. అయినా అమితాబ్ అంటే రేఖకు చెప్పలేనంత ప్రేమ.

ఆదిత్య పంచోలీ-కంగనా రనౌత్‌:

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత, సింగర్‌ ఆదిత్య పంచోలీ.. జరినా వాహబ్‌తో వివాహం జరిగింది. కానీ ఆయన కంగనా రనౌత్‌తో ఎఫైర్స్ పెట్టుకున్నట్టు తెలిసింది. కంగనానే ఆదిత్యని లొంగతీసుకుందనే వార్తలొచ్చాయి. ఆమె నుంచి ఆదిత్యని సేవ్‌ చేసుకుని ఈ ఎఫైర్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టే బాధ్యత తన భార్య జరినా తీసుకుని సెట్‌ చేసుకుందని టాక్‌. ఇక ఆదిత్య పంచోలి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది కంగనా . తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆదిత్య తనను లైంగికంగా వేధించాడని, తనను శారీరికంగా వాడుకొన్నాడని తెలిపింది. ఆ సమయంలో తనకు ఆర్థిక సమస్యలు ఉండటంతో ఆయనకు లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పింది.

షారూఖ్‌ ఖాన్‌-ప్రియాంక చోప్రా:


బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ..గౌరీఖాన్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రాతో చనువుగా ఉంటున్నట్టు, ఆమెతో ఎఫైర్స్ సాగించినట్టు బాలీవుడ్‌లో న్యూస్‌ వైరల్‌ అయ్యింది. ఈ విషయం తెలిసి గౌరీ .. షారూఖ్‌కి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఆమెతో మళ్ళీ నటించకూడదని స్పష్టం చేసిందట.

అక్షయ్‌ కుమార్‌-ప్రియాంక చోప్రా:

అక్షయ్‌ కుమార్‌ ట్వింకిల్‌ ఖన్నాతో మ్యారేజ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కీ.. ప్రియాంకతో రొమాంటిక్‌ రిలేషన్‌ కొనసాగిస్తున్నారని బాలీవుడ్‌లో వార్తలు కోడై కూశాయి. దీంతో ట్వింకిల్‌ .. అటు ప్రియాంకకి, ఇటు భర్త అక్షయ్‌కి వార్నింగ్‌ ఇచ్చింది. ఇంకా ఎప్పుడు కలిసి నటించవద్దని తెలిపింది.

అజయ్‌ దేవగన్‌-కంగనా రనౌత్‌:

`వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబాయి` చిత్రం సమయంలో కంగనాతో అజయ్‌ ఎఫైర్స్ పెట్టుకున్నారని, రొమాంటిక్ రిలేషన్‌ మెయింటేన్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అజయ్‌ భార్య , నటి కాజోల్‌.. అజయ్‌కి సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చిందట. ఆ తర్వాత కంగనాతో ఇంకా ఎప్పుడూ నటించలేదు అజయ్‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news