Gossipsకార్తీక దీపం సీరియల్ కి డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..ఆ...

కార్తీక దీపం సీరియల్ కి డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..ఆ హీరోలు వేస్ట్..??

బుల్లితెర‌పై వ‌చ్చే కార్తీక‌దీపం ఎంత సూప‌ర్ పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నిరుపమ్‌ పరిటాల.. ఈ పేరు పెద్దగా తెలుసో లేదో కానీ డాక్టర్‌ బాబు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కార్తీకదీపం సీరియల్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు నిరుపమ్‌. ప్రస్తుతం నడుస్తున్న నాటికలలో కార్తీకదీపం సీరియల్ కు మొదటి స్థానం దక్కిందని చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క అంటే ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.

ఇదిలా వుంటే తాజాగా డాక్టర్‌ బాబు ఆస్తుల గురించి ఓ కథనం నెట్టింట వైరల్‌ అవుతోంది. కార్తీకదీపం` ఫేమ్‌ డాక్టర్ బాబుగా పాపులర్‌ అయిన నిరుపర్‌ పరిటాల ఆస్తులు చూస్తుంటే స్టార్‌ హీరోలను తలపిస్తున్నారు. ఆయన సంపాదన వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఆయన ఆస్తుల గురించి వినిపిస్తున్న వార్తలు ప్రకారం ..వైజాగ్ లో నిరుపమ్ కు దాదాపు రూ.5కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉందని టాక్ . ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 80లక్షల విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది. అంతే కాకుండా 11లక్షల విలువ చేసే రెండు కార్లు కూడా ఉన్నాయని అంటారు.

కార్తీకదీపం సీరియల్‌ నుంచి ఆయనకు ఒక్కరోజుకు 22 వేల రూపాయల మేర పారితోషికం ముడుతుందట. దీనితోపాటు మరో రెండు సీరియల్స్‌లో నటిస్తుండగా వాటి రెమ్యునరేషన్‌ను కలుపుకుంటే నిరుపమ్‌ రోజూవారీ సంపాదనే రూ.60 వేల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన దీన్ని బట్టి మనకి నిరుపమ్ ప్రతినెల రూ.14 లక్షల వరకు సంపాదిస్తుంటారు అని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news