Gossipsజంట అదుర్స్..కొడుకు కోసం అమ్మాయిని సెట్ చేసిన నాగార్జున..?

జంట అదుర్స్..కొడుకు కోసం అమ్మాయిని సెట్ చేసిన నాగార్జున..?

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. అంతేకాదు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో న‌టిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ భామ మరో బొంపర్ ఆఫర్ కొట్టెసిన్నట్లు తెలుస్తుంది.

కృతిశెట్టి పర్ఫార్మెన్స్‌ చూసి ఫిదా అయిన నాగార్జున.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వల్‌గా రాబోతున్న ‘బంగార్రాజు’ మూవీలో నాగార్జునతో పాటుగా నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య జంటగా కృతిశెట్టి తీసుకుంటే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ రోల్ కోసం కొందరు హీరోయిన్లను పరిశీలించిన టీమ్.. నాగార్జున సూచన మేరకు కృతిశెట్టి వైపు మొగ్గు చూపుతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ రానున్నట్లు సమాచారం.

ఇక కృతి పాప.. నాని సరసన శ్యామ్‌ సింగరాయ్‌ మూవీతో పాటు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్‌గా ఆఫర్‌ కొట్టెసింది. అలాగే లిగుస్వామి, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో రాబోతోన్న ఉస్తాద్‌ మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మన టాలీవుడ్ హీరోలు ఈ బేబమ్మ మీద బాగా ఇంట్రస్ట్ చూపుతున్నారుగా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news