Gossipsఅబ్బాబ్బాబ్బా..వాట్ ఏ లవ్ స్టోరి..ఆ స్టార్ హీరోయిన్..మన క్రికెటర్ తో నడిపిన...

అబ్బాబ్బాబ్బా..వాట్ ఏ లవ్ స్టోరి..ఆ స్టార్ హీరోయిన్..మన క్రికెటర్ తో నడిపిన ప్రేమాయణం వింటే ఖంగుతింటారు..!!

భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. సినిమా, క్రికెట్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలను ఎంతగా ప్రేమించేవారున్నారో.. అంతకంటే ఎక్కువగా క్రికెట్‌ను ఆరాధించే వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. సినీ నటులు రీల్‌ హీరోలు అయితే, మన క్రికెటర్స్‌ను రియల్‌ హీరోలుగా చూస్తారు.

అయితే క్రికెటర్లు కొంతమంది బాలీవుడ్‌ హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. మహమ్మద్‌ అజారుద్దీన్‌ నుంచి నేటీ తరం యువ క్రికెటర్స్‌ వరకు పలువురు హీరోయిన్స్‌తో డేటింగ్‌ చేసినవారే. అవును ఎంద‌రో క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. వారిలో కొన్ని జంట‌లు పెళ్లిపీట‌లెక్క‌గా… మ‌రికొన్ని జంట‌లు మ‌నస్ఫ‌ర్ధ‌ల‌తో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డ్డారు. ఇందులో మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ కూడా ఉన్నాడు.

టీం ఇండియాలో విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉంటారు. భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఇంత బలంగా ఉందంటే ఒకప్పుడు గంగూలీ కెప్టెన్సీనే కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన దేశ క్రికెట్ అభిమానులు కలలు కన్న ఎన్నో అరుదైన విజయాలను గంగూలీ అందించారు.

అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ జీవితంలో ఎన్ని విజయాలు ఉన్నాయో అదే స్థాయిలో వివాదాలు కూడా ఉన్నాయి. అందులో నటి నగ్మాతో ఆయన మధ్య ఉన్న ప్రేమాయణం కూడా ఒకటి.

1990 కాలంలో నగ్మా దక్షిణాదిన స్టార్ హీరోయిన్. దక్షిణ పరిశ్రమలతో పాటు.. బాలీవుడ్‌లోనూ ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి.. ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ‘దాదా’ సౌరవ్ గంగూలీ ఆమెతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరు కలిసి గుట్టుచప్పుడు కాకుండా డేటింగ్ కూడా చేశారు. అప్పటికే 1997లో తన గర్ల్ ఫ్రెండ్ డోనాను ప్రేమించి పెళ్లాడిన సౌరవ్ గంగూలీ… వైవాహిక జీవితంలో ఈ నగ్మా ఎఫైర్ ఎపిసోడ్ ఓ మినీ సునామీనే సృష్టించింది.

చిన్నపాటి రూమర్‌గా ఉన్న వారి లవ్‌ మ్యాటర్‌ 1999 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో ఒక్కసారిగా గుప్పుమంది. లండ‌న్‌లో జరిగిన ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ సందర్భంగా చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగి వీరి ఫొటోలు బయటకు రావడంతో ఈ రూమర్లకు మరింత ఆధ్యం పోసినట్లు అయ్యింది. అంతేకాదు నగ్మా, గంగూలీలు జంటగా శ్రీకాళహస్తి వెళ్లి పూజ చేయించుకుంటూ మీడియాకు చిక్కారు. ఇది అప్పట్లో మరింత వివాదాస్పదంగా మారింది.

అప్పుడు నా సినీ కెరీర్‌ పీక్స్‌లో ఉంది. క్రికెటర్‌గా గంగూలీ కెరీర్ కూడా… ఆ సమయంలో ఈగో మా బంధానికి అడ్డుగా నిలిచింది. అనుబంధంలో అహానికి చోటు ఉంటే, ఆ బంధాన్ని ఎక్కువ కాలం లాగలేం కదా’ అంటూ కామెంట్ చేసింది నగ్మా. అయితే నగ్మా ప్రవర్తన నచ్చకే ఆమెతో ఎఫైర్ కట్ చేసుకున్నాడని అంటారు. ఆమె కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ… ఆమెతో ఉన్న రిలేషన్ కు గుడ్ బై చెప్పి ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారని అభిమానుల వాదన. ఇక వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఇప్పటికి హాట్ టాపిక్ గానే ఉంది.

Latest news