అది భరించలేకే ముంబైకి షిఫ్టయిన రష్మిక..!!

ఛ‌లో, గీతా గోవిందం చిత్రాల‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన కన్నడ సోయగం రష్మిక మందాన ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది. ర‌ష్మిక ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేకాక సౌత్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతిలో కలిగిన హీరోయిన్ ఎవరు అంటే కచ్చితంగా రష్మిక మందన పేరు ఎక్కువగా వినబడుతోంది.

గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” అనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమాలో నటిస్తుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డికి వ‌రుస‌గా హిందీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ పంట మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్న పరిస్థితి. ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో.. అమితాబ్ బచ్చన్ గుడ్ బాయ్లోనూ కీలక పాత్రను పోషిస్తోంది. “గుడ్‌బై” చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే షూటింగ్ కోసం ప్రతిసారీ ముంబై కి వెళ్ళిన టైంలో హోటల్ కి భారీగా ఖర్చు అవుతున్న తరుణంలో.. ఇటీవ‌ల ముంబైలో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది కన్నడ సోయగం రష్మిక మందాన. ఇక ఇదే విష‌యాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియ‌జేసింది. “ఎట్టకేలకు ఈ రోజు నా అపార్ట్ మెంట్ లోకి మారిపోయాను! చాలా వస్తువులను షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఖ‌చ్చు అంతం కానిది” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తం మీద అటు బాలీవుడ్ నుండి సౌత్ వరకూ తన హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండు చోట్ల తనకంటూ పర్మినెంట్ అడ్రస్ ఉండే రీతిలో సొంతిల్లు ఏర్పాటు చేసుకుంది రష్మిక.