డార్లింగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. ఒకటి కాదు రెండు..!!

ఆరు అడుగుల అందగాడు .. ‘మిస్టర్ పర్ ఫెక్ట్’..యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ క్రేజ్ ఖండాంత‌రాలు దాటింద‌న‌డంలో ఎటువంటి డౌటే లేదు. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిపోయారు.

బాహుబలితో నేషనల్‌ హీరోగా మారిన ప్రభాస్‌ తొలిసారి నటిస్తోన్న స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ సినిమా ‘ఆదిపురుష్‌’. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ మొత్తం వేయి కళ్లతో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ కోసం ఎదురుచూస్తున్నారు. మన డార్లింగ్ రేంజ్ కు తగినట్లుగానే చిత్ర యూనిట్‌ సినిమా మేకింగ్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడట్లేదు. ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను అత్యంత రిచ్‌ లుక్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 రాధేశ్యామ్‌ టీజర్‌ విడుదల చేయగా..ఆ టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మరో భారీ సినిమా ‘సలార్’. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే..యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియన్‌ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘సలార్’ మూవీ కోసం ప్రభాస్ బాహుబలి ఫార్ములాను రిపీట్ చేస్తున్నాడంటున్నాయి టాలీవుడ్ సన్నిహిత వర్గాలు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీని రెండు పార్టులు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. కథా విస్తృతి దృష్ట్యా పార్ట్‌-1, పార్ట్‌-2లుగా తెరకెక్కిస్తేనే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఉన్నట్లు టాలీవుడ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.