హాట్ బ్యూటీతో రోమాన్స్ కు చిరు సై..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. వెంకీమామతో హిట్ అందుకున్న కె.ఎస్ రవీంద్ర మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఎమోషనల్‌, యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో బాబీ, చిరు కోసం ప్రత్యేకంగా రేడి చేసిన ఈ స్క్రిప్ట్‌ చిరుకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడు. కె.ఎస్ రవీంద్ర తన సొంత కథతో చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించి.. ఓ అసక్తికర అప్‌డేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ.. సోనాక్షి సిన్ హాని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్స్ హవా బాగా నడుస్తోంది. బీ టౌన్‌లో ఫేమస్ అయిన హీరోయిన్స్‌పై తెలుగు దర్శకనిర్మాతలు కన్నేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కిందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. బాబీ టీం సోనాక్షిని సంప్రదించి కథ వివరించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

కాగా.. ఇంతకుముందు కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ కి తెలుగు నుండి ఒకటి రెండు ఆఫర్లు వచ్చాయట. కానీ ఈ అమ్మడు ఇంట్రెస్ట్ చూపలేదు. కాని ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమా రావడంతో సోనాక్షి ఈ అవకాశాన్ని చేజార్చుకోడానికి ఇష్టపడటం లేదట. మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ సినిమాలో హీరోయిన్‌గా సోనాక్షిని సెలక్ట్ చేశారనేది లేటెస్ట్ టాక్.
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.