మా ఎన్నిక‌ల్లో చిరు వ‌ర్సెస్ బాల‌య్య‌… ఊహించ‌ని ట్విస్టులు…!

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ( మా ) ఎన్నిక‌లు ఊహించ‌ని విధంగా మ‌లుపులు తిరుగుతున్నాయి. ముందుగా ఈ ఎన్నికల బ‌రిలోకి మెగా ఫ్యామిలీ స‌పోర్టుతో ప్ర‌కాష్ రాజ్ బ‌రిలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఆ వెంట‌నే మంచు హీరో మంచు విష్ణు తాను కూడా మా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటున్నాన‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పాటు ప‌లువురు పెద్ద‌ల‌ను క‌లుస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే విష్ణు, మోహ‌న్ బాబు ఇద్ద‌రూ క‌లిసి సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు. మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్ ఛానెల్స్‌లో ప్ర‌చారం ప్రారంభించారు. మ‌రోవైపు లోక‌ల్ విష్ణు, నాన్ లోక‌ల్ ప్ర‌కాష్ రాజ్ నినాదం కూడా స్టార్ట్ అయ్యింది.

ఈ వివాదం ఇలా ఉండ‌గానే మా ఎన్నిక‌ల బ‌రిలో తాను ఉన్నాన‌ని సీనియ‌ర్ న‌టి జీవిత క్యాంప్ నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ ముగ్గురు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తుండ‌గానే… క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ తాను సైతం ఏకంగా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోనే ఉన్నాన‌ని హింట్ ఇచ్చారు. దీంతో మా ఎన్నిక‌ల రేసులో చ‌తుర్ముఖ పోటీ నెల‌కొంది. ఇదిలా ఉంటే ప్ర‌కాష్ రాజ్‌కు మెగా కాంపౌండ్ మ‌ద్ద‌తు ఉంద‌న్న ప్ర‌చారం ఇప్ప‌టికే బ‌య‌ట‌కు బ‌లంగా వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు మ‌రో షాకింగ్ ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సీనియ‌ర్ హీరో బాల‌య్య జీవితా రాజ‌శేఖ‌ర్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ట‌.

ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో క‌న‌ప‌డకుండా మెగా, బాల‌య్య వార్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే మెగా కాంపౌండ్ స‌పోర్ట్ ప్ర‌కాష్‌రాజ్‌కు అన్న టాక్ రాగానే.. వెంట‌నే బాల‌య్య అలెర్ట్ అయ్యి మ‌హిళా కోటాలో జీవిత‌కు స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు నాగార్జున స‌పోర్ట్ కూడా చిరంజీవికే అంటున్నారు. మ‌రోవైపు మోహ‌న్ బాబు వ‌రుస‌గా సీనియ‌ర్ న‌టుల‌ను క‌లుస్తున్నారు. ఏదేమైనా స్టార్ హీరోలు తెర‌వెన‌క ఎంట్రీ ఇవ్వ‌డంతో ఈ సారి మా ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో ? కూడా ఊహించ‌లేని ప‌రిస్థితి.