ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్ల‌తో బాల‌య్య రొమాన్స్‌… !

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించే ఈ సినిమా సాలిడ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంది. బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్లో గ‌తంలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అఖండ వీరి కాంబినేష‌న్లో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడుతుంద‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజ‌ర్లు కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి.

ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రెడీ అవుతున్నారు. మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ సినిమాను బాల‌య్య ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాపై కూడా అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం త‌న కొడుకులు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ రొమాన్స్ చేసిన హీరోయిన్ల‌తోనే బాల‌య్య జోడీ క‌ట్ట‌బోతున్నాడ‌ట‌.

శృతీహాస‌న్‌, మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా ఫైన‌ల్ అయ్యార‌ని తెలుస్తోంది. వీరిలో శృతి ఎన్టీఆర్ ప‌క్క‌న రామ‌య్యా వ‌స్తావ‌మ‌య్యా, మెహ్రీన్ ఎంత మంచివాడ‌వురా సినిమాలో రొమాన్స్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌నే బాల‌య్య కోసం మ‌లినేని ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. ఈ సినిమాకు కూడా థ‌మ‌నే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.