బిగ్‌బాస్‌‌లో ఓవ‌ర్ సింప‌తీతో చీట్ చేస్తోన్న కంటెస్టెంట్‌..!

టాలీవుడ్ బ‌గ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేరుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌న్నెండో వారం వ‌చ్చే స‌రికి 12 మంది ఎలిమినేట్ అవ్వ‌గా.. అరియానా, మోనాల్‌, అభిజిత్, అఖిల్‌, అవినాష్‌, సొహైల్ మ‌రియు హారిక‌లు హౌస్‌లో కొన‌సాగుతున్నారు. అయితే వీరిలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ అవినాష్ త‌న‌దైన కామెడీతో హౌస్‌మేట్స్‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. ఓవ‌ర్ సింప‌తీతో ప్రేక్ష‌కుల‌కు విసుగు కూడా తెప్పిస్తున్నాడు.

 

 

 

అయితే త‌ర‌చూ కెమెరాల ముందు హౌస్‌మేట్స్ ముందు తన కుటుంబం కష్టాల్లో ఉంది.. తాను ఆత్మహత్య చేసుకునే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.. దయచేసి తనను ఎలిమినేట్ చేయొద్దు.. అంటూ వేడుకుంటున్నాడు. స‌మ‌యం సంద‌ర్భం కాక‌పోయినా.. లైఫ్‌లో పడ్డ‌ క‌ష్టాలు చెప్పుకుంటూ త‌న‌పై ప్రేక్ష‌కుల్లో సింప‌తీ క్రియేట్ చేస్తున్నారు.

 

 

ఈ క్ర‌మంలోనే అవినాష్ తీరుపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. కావాల‌నే ఓటింగ్ కోసం అవినాష్ సింప‌తీ గేమ్ ఆడుతూ ప్రేక్ష‌కుల‌ను చీట్ చేస్తున్నాడ‌ని సెటైర్లు పేలుస్తున్నారు. ఒక‌వేళ ముందు ముందు కూడా అవినాష్ ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. అసలుకే మోసం వ‌స్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.