దిల్ రాజుకు వ‌రుణ్‌తేజ్ షాక్… ఆ రేటుతో మైండ్ బ్లాకే…!

గ‌త ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన `ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)` ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా.. మెహ్రీన్, త‌మ‌న్నా హీరోయిన్లు వ‌చ్చిన ఈ కామిడి & రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు.

 

 

భారీ వసూళ్లతో కాసుల వర్షం కురిపించిన‌ ఈ చిత్రానికి ప్ర‌స్తుతం సీక్రెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రంపై అధికార ప్ర‌క‌టన‌ కూడా వ‌చ్చింది. అయితే ఈ సినిమా విష‌యంలో నిర్మాత దిల్ రాజుకు వ‌రుణ్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో షాక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎఫ్‌2 స‌మ‌యంలో దిల్ రాజ్ ఇస్తానన్నంతే వ‌రుణ్ తీసుకున్నాడ‌ట‌. పాత్ర పరంగా కూడా ఎలాంటి డిమాండ్లు చేయలేద‌ట‌‌.

 

 

కానీ ఇప్పుడా సినిమా సీక్వెల్‍కి మాత్రం వరుణ్‍ భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు, త‌న పాత్రకు కూడా ఎక్కువ ప్రాధ‌న్య‌త ఉండాల‌ని చెప్పాడ‌ట‌. ఒక‌వేళ వ‌రుణ్‌కు ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఇస్తే.. అనిల్ రావిపూడి మ‌రియు వెంకీల‌కు కూడా భారీగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్క‌న చూస్తే.. రూ.30 కోట్ల లోపు బడ్జెట్‍లో రూపొందిన ఎఫ్‍ 2కి ఈసారి కనీసం యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టక తప్పద‌ని అంటున్నారు.