Moviesరంగ్ దే రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది (వీడియో)

రంగ్ దే రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది (వీడియో)

భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ యేడాది ఓ ఇంటి వాడ‌య్యాడు. నితిన్ తాజా చిత్రం రంగ్ దే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్ నిర్మించే ఈ సినిమా నుంచి ఏమిటో ఇది లిరికల్ సాంగ్ ప్రీ ల్యూడ్‌ రిలీజ్ అయ్యింది. క‌పిల్ క‌పిల‌న్, హ‌రిప్రియ సంయుక్తంగా ఈ సాంగ్ పాడారు. ఏమిటో ఇది.. వివరించలేనిది.. మది ఆగమన్నది.. తనువు ఆగనన్నది అంటూ సాగిన ఈ పాట హీరో, హీరోయిన్ల మ‌ధ్య‌ మాంచి రొమాంటిక్ మూడ్‌ను గుర్తు చేస్తోంది.

 

ఇక ఈ లిరిక‌ల్ సాంగ్ వీడియో నవంబర్ 7న సాయంత్రం 4.05 గంట‌ల‌కు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక వెంకీ అట్లూరి అంటేనే రొమాంటిక్ సాంగ్స్‌, ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్‌. భీష్మ లాంటి హిట్ త‌ర్వాత అదే బ్యాన‌ర్లో వ‌స్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో ?  చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news