సంచ‌ల‌నం: త‌మిళ రాజ‌కీయాల్లోకి విజ‌య్‌… సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త జ‌య‌ల‌లిత ఉన్న‌ప్పుడే విజ‌య్‌ను ఎక్కువుగా టార్గెట్ చేయ‌డం జ‌రుగుతూ ఉండేది. జ‌య అజిత్‌కు స‌పోర్ట‌ర్ అన్న టాక్ ఉండేది. ఇక త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ న‌టుడు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

 

 

ఈ ఇద్ద‌రు హీరోలపై పొలిటిక‌ల్‌గా టాక్ న‌డుస్తుండ‌గానే ఇప్పుడు హీరో విజ‌య్ రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తున్నాడ‌న్న సంచ‌ల‌న వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ఉన్న విజయ్ పీపుల్స్ మూమెంట్ పేరుతో విజ‌య్ ఒక రాజ‌కీయ పార్టీని రిజిస్ట‌ర్ చేయించ‌న‌ట్టుగా త‌మిళ‌నాట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పార్టీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌రలోనే వెల్ల‌డి కానున్నాయి.

 

ఈ వార్త‌ల‌తో ఇప్పుడు త‌మిళ సినీ రంగంలోనే కాకుండా.. పొలిటిక‌ల్ రంగంలో కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం విజ‌య్ లోకేష్ క‌నగ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు.