ప్ర‌భుదేవా సీక్రెట్ పెళ్లి ఎవ‌రితోనో తెలుసా..!

సీనియ‌ర్ హీరో, డ్యాన్స్ మాస్ట‌ర్ ప్ర‌భుదేవా రెండో పెళ్లి వార్త‌లు కొద్ది రోజులుగా వైర‌ల్ అవుతున్నాయి. క్రేజీ హీరోయిన్ న‌య‌న‌తార‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ప్ర‌భుదేవా ఆమెను పెళ్లాడాల‌నుకున్నాడు. అంత‌లోనే వీరి మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయి. పైగా న‌య‌న ప్ర‌భుకు దూరం కావ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. తాను శింబును అయినా క్ష‌మిస్తాను కాని.. ప్ర‌భుదేవాను మాత్రం క్ష‌మించ‌న‌ని చెప్పేసింది. న‌య‌న్ దూరం అయ్యాక కెరీర్‌పై దృష్టి పెట్టిన ప్ర‌భుదేవా తాజాగా రెండో పెళ్లి చేసుకున్న వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

 

ప్ర‌భుదేవా త‌న మేన‌కోడ‌లిని రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని.. వీరి వివాహం సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లు నిజం కాద‌ట‌. ప్ర‌భు త‌న ఫిజియో థెర‌పిస్ట్‌ను పెళ్లి చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ జంట సీక్రెట్‌గా ముంబైలో పెళ్లి చేసుకుని ఆ త‌ర్వాత చెన్నై వ‌చ్చి కాపురం పెట్టార‌ట‌. ప్ర‌భుదేవాకు తీవ్ర‌మైన వెన్ను నొప్పి రావ‌డంతో ఫిజియో థెర‌పిస్ట్‌ను ముంబైలో క‌ల‌వ‌డం.. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య ప్రేమ చిగురించి పెళ్లి వ‌ర‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

 

ప్ర‌భుదేవా గ‌తంలో ల‌త‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమె విడాకులు ఇచ్చి  న‌య‌న‌తారతో ప్రేమాయ‌ణం న‌డిపాడు. తాజాగా అతడి రెండో వివాహం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా స‌ల్మాన్‌ఖాన్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.