ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో మెహ‌బూబ్ పెళ్లి…!

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ఆస‌క్తిక‌రంగా ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే బిగ్‌బాస్ ఫినాలే డేట్ డిసెంబ‌ర్ 20గా ఫిక్స్ అయ్యింది. ఇక తాజాగా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన మెహ‌బూబ్ దిల్ సే వ‌రుసగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు. అమ్మాయిల‌పై త‌న‌కు ఉన్న క్ర‌ష్ బ‌య‌ట పెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు హౌస్‌లో త‌న‌కు జోడీ లేద‌ని మెహ‌బూబ్ ‌బాధ‌ప‌డిన‌ట్టు కూడా అత‌డి మాట‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

 

ఇక హౌస్‌లో ఉన్న అమ్మాయిల్లో ఎవ‌రిని పెళ్లి చేసుకుంటావు ? ఎవ‌రితో డేట్‌కు వెళ‌తావ‌ని ప్ర‌శ్నించిన‌ప్పుడు ? మెహ‌బూబ్ ఆస‌క్తిక‌రంగా ఆన్స‌ర్ చేశాడు. అంద‌మైన దివిని తాను పెళ్లి చేసుకుంటాన‌ని… యాక్టివ్‌గా ఉండే హారిక‌తో డేట్‌కు వెళ్లాల‌ని అనుకుంటాన‌ని చెప్పాడు. ఇక రాక్ష‌సి అరియానాను చంపేయాల‌ని అనుకుంటాన‌న్నాడు. ఇంట్లో ఉన్న వారిలో అభిజిత్ త‌న‌కు పెద్ద‌న్నగా క‌నిపించాడ‌ని.. టాస్క్‌లో అభిజిత్ చేయి స‌రిగా లేక ఆడ‌డం లేదుకాని.. అత‌డో మంచి ఫైట‌ర్ అని మెహ‌బూబ్ ప్ర‌శంసించాడు. ఇక సోహైల్ అన్నింటికి అర్హుడు అని అత‌డు ఖ‌చ్చితంగా టాప్ 3లో ఉంటాడ‌ని చెప్పాడు.