Politicsమార్నింగ్ రాగా : న‌ది నుంచి స‌ముద్రం వ‌ర‌కూ తేలి‌నవి

మార్నింగ్ రాగా : న‌ది నుంచి స‌ముద్రం వ‌ర‌కూ తేలి‌నవి

ఫ‌స్ట్ కాజ్ : నేడు నవంబ‌ర్ 2 – 2020  ఎర్ర‌న్నాయుడు వ‌ర్థంతి

ఈ సంద‌ర్భంలో నివాళులు…

మ‌రికొన్ని మాట‌లు..

మెథ‌డ్స్ అండ్ మోటివ్స్

నేప‌థ్యం న‌ది
బ‌దులు కూడా కోరిన‌ది
జీవితం విశ్లేషించి
విచారించి ఫ‌లితం ఒక‌టి తేలిన‌ది
ఇప్పుడే ఎవ‌రో ఒక‌రికి
ఈ విష‌యం చెప్పాలి
లేదా ఇంకెవ్వ‌రికి అయినా

ఓవ‌ర్ టు పార్లమెంట్
ఈ సారి మీరు మాట్లాడాలి
ప్ర‌త్యేక జోన్ నుంచి
ప్ర‌త్యేకం అనుకున్న ప్ర‌తి విష‌యం వ‌ర‌కూ
నాన్నే గుర్తుకు రావాలి
లేదు నాన్న‌ని మించి మీరు  ఎదిగి రావాలి
అన్నీ వింటూ ఆ ఇంట బుజ్జాయి
న‌వ్యాంధ్ర‌కో ఆశారేఖ అవుతున్నాడు
ఇంకా ఈ వివ‌రం ఇంకొంద‌రికి చెప్పాలి
అన‌వ‌స‌రం అనుకున్న‌వి మాట్లాడ‌డం త‌గ‌ని ప‌ని
అవ‌సరం అనుకున్న‌వి ఎవ్వ‌రు మాట్లాడ‌కుండా ఉన్నా
అది నేరం..మ‌రి! మిగ‌తా ఎంపీలూ ఇలానే ఉన్నారా
ఏమో!వారికి బాధ్య‌త ఉందో లేదో కానీ ఈ బుజ్జాయి
చెప్పినవ‌న్నీ చేసేందుకు నిరంత‌రం త‌న కార్యాల‌య వ‌ర్గాల‌ను
అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉంటారు..నాన్న స‌ముద్రం
నేను న‌ది అని అంటారు అంతే!ఇంకాస్త విన‌మ్ర‌త‌తో

 

మొద‌టి మాట స్థానిక ఉత్ప‌త్తుల‌కు రాబ‌డి రావాలి రెండో మాట  స్థానిక నాయ‌క‌త్వాలు బ‌ల‌ప‌డాలి మూడో మాట నాన్నలానే ఆ త్మ గౌర‌వం నిలుపుకుని రావాలి..వీటితో పాటు ఇంకొన్ని చెబుతూ చెబుతూ నాన్నను స్మ‌రిస్తూ ఎంపీ రామూ..ప‌రిణితి సాధించే క్రమంలో..ఇంటి నుంచి విక‌సించిన వ్య‌క్తిత్వం..ఎవ్వ‌రు ఆప‌ద‌లో ఉన్నా చ‌లించిపోయేలా చేసిందంటారు. అదే ఎప్ప‌టికీ నా అనుకు నే వారికి శ్రీ‌రామ ర‌క్ష కావాల‌ని విశ్వ‌సిస్తారు. దేశం ఏ సైనికుడ్ని కోల్పోయినా త‌ల్ల‌డిల్లిపోతారు. వెంట‌నే ఆ కుటుంబాల‌కు త‌న త‌ర ఫున ఏం చేయాల‌న్నా ముందుంటారు. ఇవ‌న్నీ నాన్న నేర్పారా? హా  నేర్పారు చెప్ప‌క‌నే ఎన్నో విలువ‌లు చెప్పారు. నాయ‌కత్వ పటిమ‌కు అవి ఆలంబ‌న అయ్యాయి. నాలో నాన్న..నాలో అమ్మ..కొలువై ఉన్న తీరే నా  ప్ర‌యాణానికి మార్గ‌ద‌ర్శ‌కం అంటారాయ న.

అదొక్క‌టే ఆయ‌న ల‌క్ష్యం..

 

కెమెరా ఆన్ చేయండి..రామూ స‌ర్ మీరు ఓ చిన్న‌బాబుకు సాయం చేయాలి  చేస్తారా..హా చేస్తాను ఆయ‌న మీ నియోజ‌క‌వ‌ర్గం కా దు చేస్తారా హా చేస్తాను మీరు చెబితే త‌ప్ప‌క చేస్తాను ర‌త్నా..వెంట‌నే శివ  అను పేద క‌ళాకారుడికి సాయం చేశారు. వాడికో ఆనం దాన్ని ఇచ్చారు. వంగ‌ర మండ‌లం శివ రామూ స‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కాని శివ..కానీ ర‌త్నా చెప్పారు చేయాలి అని భావించి సా యం అందించిన వైనం ఇప్ప‌టికీ,ఎప్ప‌టికీ ఈ వ్యాస ర‌చ‌యితకో గొప్ప జ్ఞాప‌కం. రామూ స‌ర్ మ‌నం ఏమ‌యినా చేయాలి..చెప్పండి లేదు ఓ కుటుంబాన్ని మ‌నం ఆదుకోవాలి చెప్పండి..మీరు ఓ పేద విద్యార్థినికి సాయం చేయాలి..త‌ప్ప‌కుండా.. బుజ్జి పాప చ‌దు వుకు మీరు మాట సాయం చేయాలి..త‌ప్ప‌కుండా..అలా కేంద్రీయ విద్యాల‌యంలో ఓ చిన్నారికి చోటు ద‌క్కేలా చేశారు. ఆ వేళ పొం గిపోయాను..రామూ స‌ర్..నాన్నను స్మ‌రిస్తూ..మాట్లాడుతున్నారు..నాన్నంటే భ‌యం స‌ర్..గౌర‌వం ఎంతో భ‌యం కూడా అంతే అంటారాయన..నీళ్లు నిండిన క‌ళ్ల‌తో..మేం బాగా చ‌దువుకుంటే ఆనందిస్తారు ఆయ‌న..అదొక్క‌టే ఆయ‌న ల‌క్ష్యం..అని కూడా చెబు తారు.

………నాన్న ఎర్ర‌న్న అనుకున్న వాటికి అనుగుణంగా ఉంటేనే జీవితం రాణిస్తుంది

 

ముక్కారు పంట‌లు పండే నేల‌లు మావి కావు. వీలున్నంత మేర శ్ర‌మ‌కు సార‌ధికి మ‌ధ్య అన్వ‌యం కుదిరితే పండే పంట ఫ‌లిత వి లువ. రైతు కుటుంబాలు అన్నీ ఇలానే ఉంటాయి. లేదా ఉండాల‌న్న త‌ప‌ప‌న‌లో ఉంటాయి. పంట‌కు గిట్టుబాటు ఎవ్వ‌ర‌యినా ఎ లా నిర్ణ‌యిస్తారు అన్న ఆశ్చ‌ర్యం ఇంకా మాలో  మిగిలి ఉంది. అయిన‌ప్ప‌టికీ చ‌దువు అయిన‌ప్ప‌టికీ సంస్కారం ఇవ‌న్నీ అడ్డు వ ‌చ్చి ఇంకా ఒకింత నిల‌దీత‌ల‌కు దూరంగా మా జీవితాలు ఉన్నాయి. లా చ‌దువుకున్న వాడికి ఇవి తెలుసు ఏమ‌యినా చేస్తేనే  ఇ ప్ప‌టి కాలంలో మార్పు వ‌స్తుంద‌న్న‌ది. రాజ‌కీయం  నా వ‌ర‌కే ప‌రిమితం అయితే చాలు అని అనుకున్నారు. అస‌లు నా వ‌ర‌కే ఇవి నాతోనే స‌రి అని అనుకున్న రోజులున్నాయి. ఇప్ప‌టికిప్పుడు నేనేం చేయాలో అదే చేస్తాను అన్న ప్ర‌తిపాద‌న నుంచి ఓడినా,గెలి చినా ఒకేలా ఉన్నారు ఆయ‌న. బిడ్డ‌లు బాగా చ‌దువుకోవాలి. చ‌దువుకోవ‌డం అంటే ఇంగ్లీషు బాగా రావాలి. హిందీ బాగా రావాలి.. రాజ్య భాష‌తో పాటూ మాతృభాష ఇంకా పాశ్చాత్య చదువు ఇవ‌న్నీ బాగుండాలి. అవ‌రోధం భాష అయితే ఆయ‌న‌కు కోపం..ఈ వి ష‌యం ఆ బుజ్జాయిల‌కు తెల్సు..నాన్న అనుకున్న వాటికి అనుగుణంగా ఉంటేనే జీవితం రాణిస్తుంద‌ని..అలా ఇప్ప‌టి శ్రీ‌కాకుళం ఎంపీ రామూ..పూర్తి పేరు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు..అప్ప‌టి బుజ్జాయి. అలా ఇప్ప‌టి రాజ‌మ‌హేంద్రి ఎమ్మెల్యే భ‌వానీ పూర్తి పేరు ఆదిరెడ్డి భ‌వానీ..అప్ప‌టి బుజ్జాయి.

సీక్రెట్ ఆఫ్ స‌క్సెస్ అండ్ క్రెడిట్ గోస్ టు సైకిల్

 

సైకిల్ పై వెళ్తూ వెళ్తూ కొన్ని గ్రామాలను ప‌ల‌కరించే వారు..పొలాలకు వంశ‌ధార నీళ్లు వ‌స్తే సంతోషించాల‌న్న పట్టుద‌ల‌తో ఉండేవారు..ఆ రోజుల్లో యువ‌కులు ఆ రోజుల్లో పరుగులు..అన్నీ,అన్నీ ఆశ‌లను నెర‌వేర్చే క్ర‌మంలోనే ఉండేవి. ఎర్ర‌న్నాయుడు ఆయా ప్రాం  తాల్లో తిరుగుతూ తిరుగుతూ ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించారు..ఎర్ర‌న్న ఆ ప్రాంతాన తిరుగుతూ తిరుగుతూ నాలుగు మండలాల నూ త‌న‌వైపు మ‌రల్చుకున్నారు. ఓ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌కం అయ్యారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ తిరుగులేని నేత‌గా మా రారు కాల గ‌మ‌నంలో..అటుపై జిల్లా రాజ‌కీయాల్లో అడుగిడాక రామూ కూడా అనూహ్య రీతిలో ఇటుగా వ‌చ్చాక ముందు చేప‌ట్టిం ది సైకిల్ యాత్రే!

గెలుపూ ఓట‌మీ ఛోడ్ దో..

 

దేశ రాజ‌ధానిలో రాజ‌కీయాలు వేరు..తెలుగు వారికి అందులో పెద్ద‌గా హిందీ పై ప‌ట్టు లేని వారికి ఉండే అవ‌కాశాలే అంతంత మా త్రం..అయిన‌ప్ప‌టికీ చ‌దువుతోనే అన్నీ వ‌స్తాయి..గెలుపూ,ఓట‌మీ ఛోడ్ దో..అనుకుని అప్ప‌టిక‌ప్పుడు రాజ్య భాష నేర్చుకున్న వై నం ఇప్ప‌టికీ ఆయ‌న స‌న్నిహితుల స్మ‌ర‌ణ‌కు తూగేదే.. అన్న‌య్య ఏం చెప్తే అది..అన్న‌య్య దారి నుంచి మ‌ర‌లేదే లేదు  అన్న ‌ది అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా ఆ త‌మ్ముళ్ల‌ది. ఇప్ప‌టికీ అదే బాట..బాబాయ్ అచ్చెన్న తండ్రి త‌రువాత తండ్రి ఆ బుజ్జాయికి..ఆయ నేం  చెప్పినా పాటించేందుకు ఎల్ల‌వేళ‌లా తాను సిద్ధం ఇదీ ఆయ‌న అంత‌రంగం..ఎంపీ రామూ అంత‌రంగం.

ప్రాంతాల‌క‌తీతంగా రాణించాలి

ఎర్ర‌న్నాయుడు త‌రువాత శ్రీ‌కాకుళం జిల్లాకో కొత్త నాయ‌క‌త్వం కావాల‌నుకున్నారు. నేను చ‌దువూ ఉద్యోగం ఇలా ఎక్క‌డెక్క‌డో ఉ న్నా మన‌సంతా ఎప్పుడూ ఈ నేల‌పైనే అన్న‌ది ఎంపీ రామూ మాట. నాన్న మ‌ర‌ణం అనంత‌రం ఇటుగా రావాల‌న్న కోరిక ప్ర‌తిపా దన ఆ రోజు నాలో లేవు. ఇప్ప‌టికీ ఇలా అవుతుంద‌ని అనుకోలేను. నేను నాన్న‌కు వార‌సుడ్ని అనే కాదు ఈ నేల‌ను న‌మ్ముకు న్న ప్ర‌తి ఇంటికీ బిడ్డ‌ను నేను. అందుకే రాజ‌కీయాలు ఎన్ని ఉన్నా ప్రాంతాలక‌తీతంగా న‌న్ను ఆదరించే తీరే ఇష్టం..ఇప్పుడూ ఎ ప్పుడూ..అని అంటారు రామూ..

ఇవ‌న్నీ నాన్న స్మ‌ర‌ణ‌కు తార్కాణాలే..
త‌న నిబ‌ద్ధ‌త‌కు ప్ర‌తీక‌లే..ప్రామాణికాలే..

 

బాగా చ‌దువుకున్న నేప‌థ్యం మ‌ళ్లీ త‌న‌కు క‌ల‌సివ‌స్తోంది. బీటెక్ ఎంబీఏ వీటికి మించి సామాజిక నేప‌థ్యాల‌ను అర్థం చేసుకునే ప‌రి ణామ క్ర‌మం ఇవ‌న్నీ ఇవాళ మ‌రింత క‌ల‌సివ‌స్తున్నాయి. అయినా తాను ఇంకా నేర్చుకోవాల‌నే అంటారు రామూ. మొన్న‌టికి మొన్న లిబియాలో చిక్కుకున్న కార్మికులను జిల్లాకు తీసుకువ‌చ్చే క్ర‌మంలో కానీ, లాక్డౌన్ వేళ త‌న‌వంతుగా రామ‌న్న అన్నదా న క్ర‌తువు పేరిట అన్నార్తుల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్ట‌డ‌మే కాక చేయూత అందించిన వైనం కానీ, క‌రోనా విజృభిస్తున్న త‌రుణాన  ప్రత్యే కించి ర‌క్తదాన శిబిరం నిర్వ‌హించి మూడు వంద‌ల యూనిట్లకు పైగా ర‌క్తాన్ని రెడ్ క్రాస్ కు అందించి ఆప‌ద స‌మ‌యంలో త‌న బా ధ్య‌త నిర్వ‌ర్తించిన వైనం కానీ ఇవ‌న్నీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కార్య‌ద‌క్ష‌త‌కు తార్కాణాలు. ముఖ్యంగా లాన్స్ నాయ‌క్ ఉ మామహేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఆదుకున్న వైనం  ఆ ఆడబిడ్డ‌లను త‌న బిడ్డ‌లుగా భావించి వారికి ఆర్థిక  చేయూత అందించిన తీరు ఇవ‌న్నీ నాన్న స్మ‌ర‌ణ‌కు తార్కాణాలే. త‌న నిబ‌ద్ధ‌త‌కు ప్ర‌తీక‌లే.

తిరుగులేని సేన
నిబ‌ద్ధ‌త‌కు ప్రాతిప‌దిక
రోడ్డేలేని ఊరికి పోయిన రోజు నాన్న గుర్తుకువ‌స్తారు. రోడ్డు ఉన్నా అస‌లు బాధ్య‌త లేని యంత్రాంగం,కొంత స్థానిక నాయ‌క‌త్వం ఓ చోట చేరి గ్రామాన్ని అభివృద్ధి చేయ‌క‌పోతే అప్పుడూ త‌న బాధ్య‌త ఏంట‌న్న‌ది గుర్తుకువ‌స్తుంది. అప్ప‌టిక‌ప్పుడు చేయ‌ద‌గిన‌వేవో చేయాలి. కొన్ని సమూహ బాధ్య‌తలు కొంద‌రికి అప్ప‌గించి మ‌రీ!మంచి స‌మాజ నిర్మాణానికి పాటుప‌డాలి. ఇలా యువ‌త‌కో దారి చూపాలి. వారికి ప్రతినిధిగా ఉంటూ వారిలో చైత‌న్యం నింపాలి. ఈ క్ర‌మంలో రామ‌సేన నిరంత‌రం ప‌నిచేస్తుంది ఎంపీ రామూ ఆలో చన‌ల‌కు అనుగుణంగా..తిత్లీ సంద‌ర్భంలోనూ,లాక్డౌన్ వేళల్లోనూ ఇంకా అత్య‌వ‌స‌ర సంద‌ర్భాల్లోనూ రామ‌సేన నిర్విరామంగా ప‌ని చేస్తుంది..భ‌వానీ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ కు అనుబంధంగా రామ‌సేన ప‌నిచేస్తుంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో జిల్లా కేంద్రాస్ప‌త్రికి కొ న్ని అద‌న‌పు వ‌స‌తులు క‌ల్పించే విష‌య‌మై త‌న నిధులు నుంచి కోటి రూపాయ‌లు కేటాయించిన మొట్ట‌మొద‌టి ఎంపీ రామూ కా వ‌డం గ‌మ‌నార్హం. దేశంలోనే ఇలా మొట్ట‌మొద‌ట స్పందించి త‌న వేత‌నాన్ని కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల నిమిత్తం విరాళంగా ఇచ్చిన ఎం పీ కూడా ఆయ‌నే. ఆ తరువాతే ఎంపీలు త‌మ వేత‌నాల‌ను విత‌ర‌ణ చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది అని చెప్ప‌డం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. ఇలా ఎన్నెన్నో.. ఇవాళ చెప్పానుగా ఒక‌రు న‌ది మ‌రొక‌రు స‌ముద్రం..ఆ ఇరు తీరాల మ‌ధ్య
స్మ‌ర‌ణ ఓ బాధ్య‌త. నిర్వ‌హిస్తూ నిర్వ‌ర్తిస్తూ..పెద్దాయ‌న‌కు నివాళులు బుజ్జాయికి దీవెన‌లు..

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news