మ‌హేష్‌బాబు తండ్రిగా ఊహించ‌ని స్టార్ హీరో… ఎవ‌రో తెలుసా..!

మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు హిట్ త‌ర్వాత ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. మ‌హేష్‌బాబు ఓ రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని అంటున్నారు.

 

ఇదిలా ఉంటే ప్ర‌ముఖ మ‌ళ‌యాళ హీరో ముమ్మ‌ట్టికి సౌత్‌లో అన్ని భాష‌ల్లోనూ మంచి పాపులార్టీ ఉంది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమాలో ముమ్మ‌ట్టి మ‌హేష్‌కు తండ్రిగా న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హేష్ తండ్రిగా ఉండే ముమ్మ‌ట్టి ముఖ్య‌మంత్రిగా ఉంటాడ‌ట‌. అయితే ప్ర‌త్య‌ర్థుల ప‌న్నిన కుట్ర నేప‌థ్యంలో ముమ్ముట్టి ఇబ్బందుల్లో ఉంటే అప్పుడు ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చేలా క‌థ ఉంటుంద‌ట‌.

 

 

 

 

ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేక‌పోయినా కీర్తి సురేష్ పేరు ఫైన‌లైజ్ అయ్యిందంటున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో జ‌ర‌గ‌నుంది.