Moviesడ్ర‌గ్స్ కేసులో స్టార్ హీరో భార్య‌కు షాక్ ఇచ్చిన పోలీసులు

డ్ర‌గ్స్ కేసులో స్టార్ హీరో భార్య‌కు షాక్ ఇచ్చిన పోలీసులు

క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ కుంభ‌కోణంలో పోలీసులు ఇప్పటికే హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ సహా పలువురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరు ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ బావ‌మ‌రిది ఆదిత్య ఆళ్వా సైతం డ్ర‌గ్ కేసులో నిందితుడిగా ఉన్న విష‌యం గుర్తించారు. ప్ర‌స్తుతం ఆదిత్య ప‌రారీలో ఉండ‌డంతో పోలీసులు అత‌డి కోసం గురువారం ముంబైలో ఉన్న వివేక్ ఇంట్లో సోదాలు చేశారు.

 

ఆదిత్యను ప‌ట్టుకునే క్ర‌మంలోనే అత‌డి బావ అయిన వివేక్ ఇంట్లో వారెంటుతో సోదాలు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఓ వైపు అత‌డిని ప‌ట్టుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బెంగ‌ళూరు పోలీసులు ప్రియాంక అళ్వా ఒబేరాయ్‌కు నోటీసులు పంపారు. సోదరుడు ఆదిత్య అల్వాతో శాండల్‌వుడ్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రియాంకకు కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించిన‌ట్టు స‌మాచారం.

 

ప్రియాంక వివేక్‌కు భార్య‌. ఇక ఆదిత్య అళ్వా .. మాజీ మంత్రి జీవరాజ్‌ ఆళ్వా కుమారుడు అన్న విషయం తెలిసిందే. మ‌రి ఈ కేసులో ఇంకెన్ని కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news