కోడ‌ల్ని పెళ్లాడిన మామ‌… సంతోషంగా తాళి క‌ట్టించుకున్న కోడ‌లు

స‌మాజంలో చాలా చిత్ర విచిత్రాలు జ‌రుగుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో కొడుకు చ‌నిపోయి విధ‌వ‌రాలిగా ఉన్న కోడ‌లిని సొంత మామే పెళ్లాడాడు. బ‌లాస్‌పూర్ జిల్లాలో కృష్ణా రాజ్‌పుత్‌సింగ్‌కు గౌత‌మ్ రాజ్‌పుత్ అనే కుమారుడు ఉన్నాడు. గౌత‌మ్‌కు ఆర్తీ అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే రెండు సంవ‌త్స‌రాల పాటు వీరి సంసారం చ‌క్క‌గానే సాగంది. అయితే ఇటీవ‌లే ఓ రోడ్డు ప్ర‌మాదంలో గౌత‌మ్ మృతి చెందాడు. అప్ప‌టి నుంచి కోడ‌లు ఆర్తి అత్తారింట్లోనే ఉంటోంది.

 

రాజ్‌పుత్ వంశంలో స్త్రీలు పెద్దగా బయటకు రారు. దీంతో భర్త మరణించినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఆర్తిసింగ్ ఇంట్లోనే ఉండిపోయింది. అయితే వారి వంశ ఆచారం ప్ర‌కారం ఆమెకు మ‌రో వివాహం చేయ‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు చ‌ర్చించుకున్నారు. మామ తనని బాగా చూసుకుంటున్నారు కనుక ఆయనకు ఇష్టం ఉంటే నేను మామని పెళ్లాడ‌తాన‌ని కోడ‌లు చెప్పింది.

 

ముందు కోడ‌లు నిర్ణ‌యంతో వారంతా షాక్ అయ్యారు.  అయితే కోడ‌లు మాత్రం మామ త‌న‌ను ఎంతో బాగా చూసుకున్నాడ‌ని ఇప్పుడు తాను మ‌రో వ్య‌క్తిని పెళ్లాడి ఆ ఇంటి నుంచి వెళ్లిపోలేన‌ని చెప్ప‌డంతో చివ‌ర‌కు వారిద్ద‌రికి పెళ్లి చేశారు. చివ‌ర‌కు రాజ్‌పుత్‌ సంప్రదాయం ప్రకారం కొద్దిమంది సమక్షంలో వారి వివాహం జరిగింది.