నాని మ‌ర‌ద‌లు ఎవ‌రో తెలుసా..!

నేచుర‌ల్ స్టార్ నాని లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా వి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన వి సినిమా అంచ‌నాలు అందుకోలేక బొక్క బోర్లా ప‌డింది. ఈ క్ర‌మంలోనే నాని త‌న నెక్ట్స్ సినిమాల‌ను వ‌రుస‌గా లైన్లో పెడుతూ దూసుకు పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే నాని నెక్ట్స్ సినిమాలో మ‌ర‌ద‌లుగా టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామ‌స్ న‌టించ‌నుందని తెలుస్తోంది. నివేధ నాని ప‌క్క‌న ఇప్ప‌టికే జెంటిల్‌మెన్‌, నిన్న కోరి సినిమాల్లో న‌టించింది.

Niveda Thomas- Best Telugu Actor in Leading Role Female Nominee | Filmfare  Awards

ఈ ఇద్ద‌రి జోడీకి అదిరిపోయే క్రేజ్ ఉంది. అయితే నాని కొత్త సినిమాలో మాత్రం హీరోయిన్‌గా వేరే అమ్మాయిని తీసుకుని.. నానికి మ‌ర‌ద‌లుగా నివేద‌ను న‌టింప‌జేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఇక అల్లు అర్జున్ సినిమాలోనూ ఆమె చిన్న రోల్ చేయ‌నుందంటున్నారు. ప్ర‌స్తుతం ఆమె మళ‌యాళంలో రెండు సినిమాలు చేస్తోంది. నివేద ద‌గ్గ‌ర టాలెంట్ ఉన్నా బాగా స్ట్రిక్ట్ అన్న కార‌ణంగానే ఆమెకు ఇక్క‌డ పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదంటున్నారు.