సీరియ‌ల్స్‌లోకి సుమ ఎంట్రీ.. ఆ ఛానెల్‌తో డీల్…!

ఇప్పుటికే బుల్లితెర‌పై ఏ ప్రోగ్రామ్ వ‌చ్చినా అన్నింట్లోనూ క‌నిపించే సుమ‌కు ఇక్క‌డ ఎంత డిమాండ్ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సుమ‌కు ఉన్న క్రేజ్‌కు ఆమె సినిమాల్లో న‌టించేందుకు ఓకే చెప్పినా బోలెడ‌న్నీ ఛాన్సులు వ‌స్తాయి. అయితే ఆమెకు సినిమాల్లో న‌టించాల‌న్న ఆస‌క్తి అయితే లేదు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం సుమ సీరియ‌ల్స్‌లో న‌టించేందుకు రెడీ అవుతోంద‌ట‌. స్టార్ మా ఛానెల్ నిర్మించే ఓ సీరియ‌ల్లో ఆమె న‌టించే అంశంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu states: Anchor Suma reacts on the news about her health - Times of  India

అయితే ఆ సీరియ‌ల్లో ఆమె హీరో కుటుంబంలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఆమె పాత్ర ఎక్కువ ఉండ‌ద‌ని.. వారానికి రెండు, మూడు ఎపిసోడ్ల‌లో మాత్ర‌మే ఆమె క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సుమ ఓకే చెప్పాలే కాని రెండు, మూడు సినిమాల్లో ఆమెకు ఆఫ‌ర్లు రెడీగా ఉన్నాయ‌ట‌. ఇక సుమ బుల్లితెర‌పైనే కాదు వెండితెర‌పై కూడా గ‌తంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఇక విన్న‌ర్ సినిమాలో పాట కూడా పాడింది. ఇప్పుడు బుల్లితెర‌పై కీల‌క పాత్ర‌ల‌తో స‌రికొత్త ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

Watch: TV host Suma Kanakala turns emotional bidding farewell to Star  Mahila after 12 years - Times of India