హీరోయిన్ల‌ను నిండా ముంచుతున్నారా… మాయ మాట‌ల‌తో మోస‌పోయి ల‌బోదిబో..!

చాలా మంది స్టార్ హీరోయిన్లు భారీ రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటున్నారు. ఇలా వ‌చ్చిన సొమ్ముతో వారు సైడ్ బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్‌, మ‌రి కొంద‌రు ప‌బ్‌లు, హోట‌ల్లు, రెస్టారెంట్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. కొంద‌రు మాత్రం ఎవ్వ‌రికి తెలియ‌కుండా సినిమాల‌కు పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇందుకు కార‌ణం భారీ వ‌డ్డీల‌కు ఆశ ప‌డ‌డ‌మే. అయితే ఇలా పెట్టుబ‌డులు పెడుతోన్న వారిలో కొంద‌రు హీరోయిన్లు మాట మాట‌ల‌కు మోస‌పోయి త‌మ సొమ్మంతా పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నార‌ట‌.

 

హీరోయిన్ల‌లో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జిమ్ వ్యాపారంలోనూ, అనుష్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ పెట్టుబ‌డులు పెట్టార‌న్న‌ది తెలిసిందే. కొంద‌రు హీరోయిన్లు మాత్రం మీడియం రేంజ్ సినిమాల‌కు పెట్టుబ‌డులు పెడితే 5 – 10 రూపాయ‌ల వ‌డ్డీ వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డి కొంద‌రు బ్రోక‌ర్ల మాట‌లు న‌మ్మి పెట్టుబ‌డులు పెట్టార‌ట‌. అయితే ఇప్పుడు వారు వ‌డ్డీ సంగ‌తి దేవుడు ఎరుగు.. అస‌లుకే ఎగ‌నామం పెట్టార‌ట‌.

 

 

దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటే అంత వ‌డ్డీకు అప్పు ఇవ్వ‌డం త‌ప్పు. దీంతో ఇలా పెట్టుబ‌డులు పెట్టిన ఇద్ద‌రు హీరోయిన్ల సొమ్మంతా అడ‌వి పాలు అయ్యింద‌ని.. ఇలాంటి బ్రోక‌ర్ల విష‌యంలో హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలిసినవాళ్లు. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది.