పురుషాంగం కేక్‌తో హీరోయిన్ పార్టీ.. ట్రోలింగ్‌పై షాకింగ్ రిప్లే

హీరోయిన్ నియా శ‌ర్మ త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పురుషాంగాన్ని పోలిన కేక్ క‌ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేక్‌ను ముందు పెట్టుకుని సిగ్గుప‌డుతూ ఆమె ఇచ్చిన స్టిల్ కూడా వైర‌ల్ అయ్యింది. దీంతో నెటిజ‌న్లు, సంప్ర‌దాయ వాదులు ఆమెపై మండిప‌డ్డారు. మ‌న సంస్కృతి చెడ‌గొడుతున్నావ్ అంటూ ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. ఓ ఆడ‌పిల్ల అయ్యి ఉండి అలాంటి కేక్‌ను ఎలా కోసింద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

 

ఈ వివాదంపై హీరోయిన్ నియాశర్మ స్పందించింది. తాను రోజు వారి ఒత్తిళ్ల నుంచి ఉప‌శ‌మ‌నం కోస‌మే సోష‌ల్ మీడియా చూస్తుంటాన‌ని… అయితే ఇలాంటి ట్రోల్స్‌ను తాను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. కొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి పెడుతానని నియా శర్మ తాజాగా స్పష్టం చేసింది.