విజ‌య‌వాడ యువ‌తి హ‌త్య కేసు చేధించిన పోలీసులు… క్లైమాక్స్ ఇలా…

విజ‌య‌వాడ‌లో ఓ ఇంజ‌నీరింగ్ విద్యార్థిని హ‌త్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ఈ హ‌త్య కేసులో దివ్య‌, నాగేంద్ర మ‌ధ్య అస‌లు ఏం జ‌రిగింది అన్న‌ది పోలీసులు తేల్చేశారు. దివ్య రూంలో ఉండ‌గా నాగేంద్ర దొంగ‌త‌నంగా వెళ్లి గ‌డి పెట్టాడ‌ని తేలింది. ఆ త‌ర్వాత క‌త్తితో దివ్య‌ను 13 సార్లు పెడిచి త‌న‌కు తాను కూడా పొడుచుకున్నాడ‌ని తేలింది. నిందుతుడు చేసిన కొన్ని తప్పులే చివరికి పోలీసులకి క్లూ గా మారి హంతకుడిని పట్టించాయి.

 

యువతి మొబైల్ ఫోన్ లో దొరికిన ఆడియో సంభాషణ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టి చివ‌ర‌కు మిస్ట‌రీ చేధించారు. ఆరు నెల‌లుగా నాగేంద్ర పెళ్లి చేసుకోమ‌ని వేధిస్తున్నాడ‌ని యువ‌తి మాట్లాడిన మాట‌లు హంత‌కుడిని ప‌ట్టించాయి. ఇక దివ్య‌ను మంగ‌ళ‌గిరి చ‌ర్చిలో పెళ్లి చేసుకున్నాన‌ని నాగేంద్ర చెప్పిన మాట‌లు కూడా అబ‌ద్ధ‌మ‌ని పోలీసులు తేల్చారు. అస‌లు వారి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం కూడా న‌డ‌వ‌లేద‌ని.. పెయింట‌ర్ ప‌నులు చేసుకునే నాగేంద్రే ఆమెను వేధిస్తున్నాడ‌ని తేల్చారు.

 

నాగేంద్ర ఫోన్లో దివ్య ఫొటోలు ఎన‌లైజ్ చేయ‌గా.. అవ‌న్నీ మార్పింగ్ చేసిన‌వే అని తేల్చేశారు. దీంతో హంత‌కుడు నాగేంద్ర అన్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలని ఆమె తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. ఇక త‌మ‌కు న్యాయం జ‌ర‌గాల‌ని కూడా దివ్య త‌ల్లిదండ్రులు సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నున్నారు.