ప్రేమ‌దేశం అబ్బాస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!

అబ్బాస్ ఈ పేరు ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల‌కు గుర్తు ఉండ‌క‌పోవ‌చ్చు కాని.. రెండు ద‌శాబ్దాల క్రితం సౌత్‌లో అబ్బాస్ పాపుల‌ర్ హీరో. పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోయినా త‌క్కువ సినిమాలు చేసినా హిట్ అయ్యాయి. అబ్బాస్‌కు కెరీర్ ఆరంభంలోనే వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ప్రేమ‌దేశం. ఆ సినిమాలో అబ్బాస్‌, వినీత్ క‌లిసి టబు ప్రేమ‌కోసం ఏం చేశార‌న్న క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత అబ్బాస్ కొన్ని సినిమాలు చేసినా స్టార్ హీరో గుర్తింపు రాలేదు.

 

 

ఆ సినిమా త‌ర్వాత యూత్ చాలా మంది అబ్బాస్ హెయిర్ స్టైల్‌కు పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. తెలుగు, త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం సినిమాల్లో న‌టించిన అబ్బాస్ చివ‌ర‌గా 2014లో వ‌చ్చిన అలా జ‌రిగింది ఒక రోజు సినిమాలో చివ‌రి సారిగా క‌నిపించారు. ఆ త‌ర్వాత బుల్లితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చాక త‌మిళ్‌లో రెండు పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో కూడా న‌టించారు.

 

 

చివ‌ర‌గా 2016లో ఓ మ‌ళ‌యాళం సినిమా చేసి సినిమాల‌కు గుడ్ బై చెప్పేశారు. ప్ర‌స్తుతం న‌ట‌న‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి న్యూజిలాండ్‌లో సెటిల్ అయ్యారు. ఇక అబ్బాస్ చేసిన హార్పిక్ యాడ్ ఇప్పట‌కీ బుల్లితెర‌పై బాగా సందడి చేస్తుంటుంది.