చిత్రం హీరోయిన్ రీమాసేన్ ఏం చేస్తుందో తెలుసా… విల‌న్‌గానా..!

2000 సంవ‌త్స‌రంలో ఉషా కిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్లో వ‌చ్చిన సినిమా చిత్రం. ఉద‌య్ కిర‌ణ్ – రీమాసేస్ ఈ సినిమాతో హీరో, హీరోయిన్లుగా ప‌రిచ‌యం అయ్యారు. తేజ ఈ సినిమాతోనే మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా రోజుల్లోనే రు. 7 కోట్ల వ‌సూళ్లు రాబట్టింది. భారీ లాభాలు వ‌చ్చాయి. ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్‌తోనే తేజ‌, రీమాసేన్‌, ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ కొన్నేళ్ల వ‌ర‌కు చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది.

 

 

రీమాకు క‌ల‌ర్ త‌క్కువ అయినా చిత్రం హిట్ అయ్యాక క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆ త‌ర్వాత మ‌రోసారి ఉద‌య్ కిర‌ణ్ ప‌క్క‌న 2001లో మ‌న‌సంతా నువ్వే సినిమా చేయ‌గా ఆ సినిమా సైతం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అప్పుడు కోలీవుడ్‌లోనూ ఆమెకు అవ‌కాశాలు వ‌చ్చాయి. శింబు ప‌క్క‌న వ‌ల్ల‌భ సినిమాలో నటించింది. సౌత్‌లో ప‌లువురు హీరోల ప‌క్క‌న న‌టించిన రీమాసేన్ 2012లో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

 

విచిత్రం ఏంటంటే ఆమెకు పెళ్ల‌య్యి ఎనిమిదేళ్లు అయినా.. పిల్ల‌లు ఉన్నా కూడా ఆమె ఇప్ప‌ట‌కీ చిత్రం సినిమాలో ఎలా ఉందో ? అలాగే ఉంది. ఇక ఆమె త్వ‌ర‌లోనే మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెకు విల‌న్ రోల్స్ ఆఫ‌ర్లు చేస్తున్నార‌ట‌.‌