కృష్ణ – కృష్ణంరాజుది ఎన్ని సంవ‌త్స‌రాల స్నేహ‌మో తెలుసా… !

టాలీవుడ్‌లో నిన్న‌టి త‌రం లెజెండ్రీ హీరోలు కృష్ణ‌, కృష్ణంరాజు. ప్ర‌స్తుతం వీరు ఇద్ద‌రు త‌మ త‌మ కుటుంబాల‌తో ఆహ్లాద‌క‌ర‌మైన జీవితం గ‌డుపుతున్నారు. అయితే ఈ ఇద్ద‌రి హీరోల స్నేహానికి చాలా చ‌రిత్ర ఉంది. వీరిద్ద‌రికి ఎంతో అనుబంధం ఉంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. అయితే వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన తొలి సినిమా మ‌నుషులు చేసిన దొంగలు.

 

 

ఈ సినిమా వ‌చ్చి 43 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా ఆ జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్న కృష్ణంరాజు త‌న సోష‌ల్ మీడియాలో వాటిని షేర్ చేశారు. మ‌ల్లిఖార్జున రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అప్ప‌ట్లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. నాటి జ్ఞాప‌కాలు షేర్ చేసిన కృష్ణంరాజు ఆ సినిమా స్మృతులు గుర్తు చేసుకున్నారు.

 

ఈ సినిమా చేయడం ద్వారా తాను సూపర్ స్టార్ కృష్ణకు తనను మరింత దగ్గర చేసిందన్నారు. ఈ సినిమాతో సూప‌ర్‌స్టార్‌తో నాకు ఉన్న అనుబంధం మ‌రింత ద‌గ్గ‌రైంద‌ని కృష్ణంరాజు సంతోషం వ్య‌క్తం చేశారు.