బ్రేకింగ్‌: బాల‌య్య న‌ర్త‌నశాల రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

బాల‌య్య న‌ర్త‌న‌శాల సినిమా ఏంట‌న్న డౌట్ చాలా మందికి వ‌స్తుంది. అస‌లు ఇప్పుడున్న జ‌న‌రేష‌న్లో చాలా మందికి న‌ర్త‌న‌శాల గురించి తెలియ‌దు. అప్పుడెప్పుడో 2001లో న‌ర‌సింహ‌నాయుడు హిట్ అయ్యాక బాల‌య్య స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌ర్త‌నశాల సినిమా ప్రారంభ‌మైంది. దివంగ‌త సౌంద‌ర్య ద్రౌప‌దిగా చేసింది. కొద్ది రోజులు షూట్ కూడా చేశారు. పాండ‌వ వ‌న‌వాసం ఆధారంగా బాల‌య్య డైరెక్ష‌న్‌లోనే ఈ సినిమా తీశారు.

 

ఆ త‌ర్వాత బ‌డ్జెట్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆ త‌ర్వాత సౌంద‌ర్య చనిపోవ‌డం… అనేక కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా గురించి మ‌ళ్లీ ఎవ్వ‌రూ ఆలోచించ‌లేదు.. ఇప్పుడు ఇర‌వై సంవ‌త్స‌రాలు గ‌డచిపోయాయి. ఇప్పుడు దానిని రిలీజ్ చేస్తున్నారు. బాల‌య్య ఈ సినిమా గురించి ఆయ‌న ఫేస్‌బుక్‌లో రాసుకున్న పోస్టు ఇలా ఉంది.

 

నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా ఆ సినిమాలో మేం న‌టించిన సీన్ల‌ను చూడాల‌న్న కోరిక‌తో మీరు ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి 17 నిమిషాల నిడివి ఉన్న సీన్ల‌ను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం చేస్తున్న‌ట్టు బాల‌య్య చెప్పారు.

 

ఇక అర్జునుడిగా తాను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తామనీ ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోందని బాల‌య్య చెప్పారు.