బిగ్‌బాస్ 4: డేంజ‌ర్ జోన్లో ఆ ముగ్గురు కంటెస్టెంట్లు.. ఎవ‌రు అవుటో..!

బిగ్‌బాస్ సీజ‌న్‌లో ఈ వారం ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేష‌న్ జోన్లో ఉన్నారు. వీరిలో టాప్ 5లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు కూడా ఎలిమినేష‌న్ జోన్లో ఉండ‌డంతో ఈ సారి ఎలిమినేష‌న్ కాస్త ట‌ఫ్‌గానే ఉండ‌నుంది. ఈ వారం ఎలిమినేష‌న్లో ఉన్న వారిలో ముగ్గురు డేంజ‌ర్ జోన్లో ఉన్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. అభిజిత్‌, లాస్య‌, అఖిల్‌, మోనాల్‌, అరియానా ఇలా సేఫ్ గేమ్ ఆడుతోన్న వారంతా కూడా ఈ వారం నామినేష‌న్ల‌లో ఉన్నారు. ఇక బ‌య‌ట న‌డుస్తోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం ఈ వారం నామినేష‌న్ల‌లో ఉన్న వారిలో ముగ్గురు కంటెస్టెంట్లు డేంజ‌ర్ జోన్లో ఉన్నారు.

Bigg Boss Telugu Vote Season 4 Online Voting - Bigg Boss 4 Telugu Voting

వీరిలో దేత్త‌డి హారిక‌, మోనాల్‌, నోయెల్‌. వీరిలో ఒక‌రు ఈ వారం బ‌య‌ట‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. కుమార్ సాయి కూడా వీకే అయినా ఇటీవ‌ల టాస్క్‌ల్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో అత‌డికి రోజు రోజుకు బ‌య‌ట బాగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇక అభిజిత్‌, లాస్య‌, అఖిల్ ఎలాగూ స్టార్ కంటెస్టెంట్లుగా ఉన్నందున వీరు సులువుగానే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Bigg Boss Telugu 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్  నెంబర్స్ ఇవే... | వినోదం News in Telugu

ఇక అరియానా చాలా క‌ష్ట‌ప‌డుతూ ట‌ఫ్ ఫైట్ ఇస్తోంది. ఇక నోయెల్ ఇటీవ‌ల ఆట‌పై స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌ట్లేదు. గంగ‌వ్వ‌లా బ‌య‌ట‌కు వెళ్లిపోతే బాగుంటుంద‌ని చెపుతున్నాడు. ఇక మోనాల్ ఎప్పుడూ అఖిల్‌తోనే ఉంటూ హౌస్‌లో చాలా గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఇక హారిక ఇటీవ‌ల ఆట‌పై పూర్తిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌ట్లేదు. మ‌రి ఈ ముగ్గురిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో ? చూడాలి.