అఖిల్ 5 హీరోయిన్ ఫిక్స్‌… రాసి పెట్టుకోండి బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ సినిమా అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాతో అయినా అఖిల్‌కు హిట్ వ‌చ్చేలా చేయాల‌ని అఖిల్ తండ్రి నాగార్జున ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని చూస్తున్నా సంక్రాంతికి ట‌ఫ్ ఫైట్ ఉండ‌డంతో ఎంత వ‌ర‌కు రిలీజ్ చేస్తార‌న్న‌ది క్లారిటీ లేదు.

 

 

ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే అఖిల్ ఐదో సినిమా స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నుంది. ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా క్రేజీ హీరోయిన్‌నే పెట్టాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఈ క్ర‌మంలోనే ప‌లువురు హీరోయిన్ల పేర్లు ప‌రిశీలించి చివ‌ర‌కు ర‌ష్మిక మంద‌న్న‌ను ఫైన‌లైజ్ చేశారంటున్నారు. ఆమె ఎక్క‌వ డిమాండ్ చేసినా స‌రే ర‌ష్మిక ఉంటేనే సినిమాకు క్రేజ్ పెరుగుతుంద‌ని ఆమెనే హీరోయిన్‌గా పెట్టార‌ట‌.

 

రష్మిక ప్రస్తుతం బన్నీతో కలిసి పుష్ప సినిమా చేస్తోంది. ర‌ష్మిక – అఖిల్ జోడీ అంటే వెండి తెరపై వీనుల విందు మామూలుగా ఉండ‌దు. సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ ఉన్నా బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే అవుతుంది. ఏదేమైనా అఖిల్ వ‌రుస‌గా పూజా హెగ్డే, ర‌ష్మిక లాంటి క్రేజీ హీరోయిన్ల‌తో జోడీ క‌డుతూ సినిమాల‌కు మంచి హైప్ తెచ్చుకుంటున్నాడు.