బాల‌య్య‌, చిరు కోసం ట్రై చేసిన పూరి ఇప్పుడు ఏ హీరోతో క‌మిట్ అయ్యాడో తెలుసా..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు గ‌తేడాది రామ్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అయిన వెంట‌నే పూరికి తిరిగి వ‌రుస‌గా ఛాన్సులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ చేస్తోన్న పూరి ఆ సినిమా త‌ర్వాత టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమాలు చేయాల‌ని అనుకున్నాడు.

 

 

అయితే చిరు పూరికి ఛాన్స్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. చిరు వ‌రుస‌గా వేరే డైరెక్ట‌ర్లకు క‌మిట్ అయిపోతున్నాడు. ఇక బాల‌య్య – పూరి కాంబోలో పైసా వ‌సూల్ సినిమా వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాల‌య్య మ‌రోసారి పూరీతో సినిమా చేస్తాన‌న్నా ఇప్పుడు ఎందుకో ఛాన్స్ ఇవ్వ‌లేదు. చిరుతో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఉన్న పూరికి విసుగు వ‌చ్చేసింద‌ట‌. ఇక బాల‌య్య కూడా ఔన‌నీ కాద‌ని చెప్ప‌క‌పోవ‌డంతో పూరి ఇప్పుడు కింగ్ నాగార్జున‌తో ఓ సోషియో ఫాంట‌సీ క‌థ‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్‌..?

 

 

గతంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సూప‌ర్‌, శివ‌మ‌ణి హిట్ అయ్యాయి. సూప‌ర్ మోడ్ర‌న్ సినిమాగా నిలిస్తే.. శివ‌మ‌ణి హిట్ అయ్యిందే. దీంతో ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత వీరి కాంబోలో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది.