ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడంటే..!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ కాంబోలో జల్సా – అత్తారింటికి దారేది – అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. వీటిల్లో జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌గా అజ్ఞాత‌వాసి ప్లాప్ అయ్యింది. అజ్ఞాత‌వాసి లాంటి ప్లాప్ త‌ర్వాత మ‌రోసారి వీరి కాంబినేష‌న్లో సినిమా రావాల‌ని టాలీవుడ్ అభిమానులు, ప‌వ‌న్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌తో చేస్తోన్న సినిమా త‌ర్వాత ప‌వ‌న్‌తో సినిమా చేసేందుకు ఇప్ప‌టి నుంచే రెడీ అవుతున్నాడ‌ట‌.

 

 

త్రివిక్ర‌మ్ సైతం ప‌వ‌న్ కోసం రెండు, మూడు క‌థ‌లు రెడీ చేసుకుని ప‌వ‌న్‌కు వినిపించాడ‌ట‌. అయితే ప‌వ‌న్ ప్ర‌స్తుతం నాలుగు సినిమాలు క‌మిట్ అయ్యాడు. వ‌చ్చే రెండేళ్లు ఈ నాలుగు సినిమాల‌కే స‌రిపోనుంది. త్రివిక్ర‌మ్‌తో సినిమా అంటే క‌నీసం ఎనిమిది నెల‌ల స‌మ‌యం కావాలి. ఈ లెక్క‌న 2023లో వీరి సినిమా ఉండే అవ‌కాశం ఉంది.

 

 

అంటే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు యేడాది ముందు వీరి కాంబోలో సినిమా వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు కూడా యేడాది ముందు అజ్ఞాత‌వాసి సినిమా వ‌చ్చింది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఈ సారి ప‌క్కాగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇవ్వాల‌ని త్రివిక్ర‌మ్ క‌సితో ఉన్నాడ‌ట‌.

Leave a comment