తెలంగాణ‌లో విషాదం… చేప‌ల కూర‌తిని భార్య మృతి… భ‌ర్త ప‌రిస్థితి విష‌మం

తెలంగాణ‌లో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. చేపల కూర తిన‌డంతో భార్య భ‌ర్త‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిలో భార్య ఇప్ప‌టికే మృతి చెంద‌గా.. భ‌ర్త ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మోత్కురుకు చెందిన బుర్ర పుష్ప (35), బుర్ర జాహంగీర్‌ దంపతులు రాత్రి చేపల కూర వండుకొని తిన్నారు. అయితే అర్ధ‌రాత్రి దాటాక వీరికి క‌డుపులో తీవ్ర‌మైన నొప్పితో పాటు వాంతులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి.

అయితే వీరి కుటుంబ స‌భ్యులు వీరిని హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలోనే పుష్ప మృతి చెందింది. ఇక జ‌హంగీర్‌ను స్థానికంగా చికిత్స చేయించి ఆ వెంట‌నే హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. ఇక జ‌హంగీర్ ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. ఈ దంప‌తుల‌కు పదిహేన్లలోపు ఇద్దరు కుమార్తెలున్నారు.

Leave a comment