Moviesవ‌కీల్‌సాబ్‌లో క్రిమిన‌ల్ లాయ‌ర్ వ‌చ్చేశాడు.... దుమ్మురేపిన ప‌వ‌ర్‌స్టార్‌

వ‌కీల్‌సాబ్‌లో క్రిమిన‌ల్ లాయ‌ర్ వ‌చ్చేశాడు…. దుమ్మురేపిన ప‌వ‌ర్‌స్టార్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌కీల్‌సాబ్ అప్‌డేట్ ముందుగా చెప్పిన‌ట్టుగానే ఉద‌యం 9.09 గంట‌ల‌కు ప్ర‌క‌టించారు. వ‌కీల్‌సాబ్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. 42 సెక‌న్ల పాటు ఉన్న వీడియోలో ప‌వ‌న్ క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా క‌నిపించే లుక్ రివీల్ అయ్యింది. ప‌వ‌న్ చేతిలో ఉన్న క్రిమిన‌ల్ లా పుస్త‌కం చేతుల్లో ఉంది. ప‌వ‌న్ చివ‌ర్లో కాలు ఓ స్టూల్‌పై పెట్టి ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. చివ‌ర‌గా ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. బ్యాక్ గ్రౌండ్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే అన్న సాంగ్ హైలెట్ అయ్యింది. థ‌మ‌న్ బీజీఎం సూప‌ర్బ్‌గా ఉంది.

 

బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప‌వ‌న్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో వ‌కీల్‌సాబ్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సరసన అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్, ఫ‌స్ట్ సాంగ్ దుమ్ము రేపుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news