Gossipsఈ టాలీవుడ్ హీరోలు డ్ర‌గ్స్ మ‌త్తులో తేలుతున్నారా...!

ఈ టాలీవుడ్ హీరోలు డ్ర‌గ్స్ మ‌త్తులో తేలుతున్నారా…!

బాలీవుడ్ యువ‌న‌టుడు సుశాంత్‌సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ కేసులో కొత్త‌గా డ్ర‌గ్స్ ఉదంతం కూడా బ‌య‌ట‌కు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత నార్కోటిక్స్ అధికారులు రియాను విచారిస్తోన్న క్ర‌మంలోనే క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలోనూ ఉన్న డ్ర‌గ్ లింకులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్న‌డ నాట ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్ల పేర్లు ఈ ఉదంతంతో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో సంజ‌న‌, రాగిణి ద్వివేది ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనూ గ‌తంలో డ్ర‌గ్స్ లింకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అప్ప‌ట్లో ప‌లువురిని అధికారులు పిలిచి విచారించినా ఆ విష‌యం చ‌ల్లారిపోయింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇంకా కొంద‌రు టాలీవుడ్ హీరోలు డ్ర‌గ్స్ మ‌త్తులోనే మునిగి తేలుతున్నార‌ట‌. ఓ బ‌డా నిర్మాత కొడుకు కం హీరో, మ‌రో పెద్ద హీరో కొడుకు, మ‌రో బ‌డా ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు యంగ్ హీరోలతో పాటు ఛాన్సులు లేని యంగ్ హీరోల‌తో పాటు అవుట్ డేటెడ్ అయిన హీరోలు సైతం ఈ డ్ర‌గ్స్ మ‌త్తులో మునిగి తేలుతున్నార‌ట‌.

 

వీరితో పాటు టాలీవుడ్‌లో కొంద‌రు సీనియ‌ర్ హీరోయిన్ల‌కు కూడా డ్రగ్స్ తీసుకునే అల‌వాటు ఉంద‌ని అంటున్నారు. ఒక డైరెక్ట‌ర్‌తో పాటు ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉన్న ఓ హీరోయిన్ కూడా ఇప్ప‌ట‌కీ డ్ర‌గ్స్‌కు బానిస‌లుగానే ఉన్నార‌ని తెలుస్తోంది.   టాలీవుడ్ లో పెద్ద ఎత్తున డ్రగ్ మాఫియా లీడర్‌తో ఉన్న లింకులు ఎప్పుడైనా మ‌ళ్లీ బ్లాస్ట్ కావొచ్చ‌న్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news