Moviesరాజీవ్‌తో విడాకుల‌పై క్లారిటీ ఇచ్చేసిన సుమ‌.. అనుమానాలు తొల‌గిపోయాయ్‌

రాజీవ్‌తో విడాకుల‌పై క్లారిటీ ఇచ్చేసిన సుమ‌.. అనుమానాలు తొల‌గిపోయాయ్‌

ఇటీవ‌ల కాలంలో యాంక‌ర్ సుమ – రాజీవ్ క‌న‌కాల వైవాహిక జీవితంపై ఎన్నో రూమ‌ర్లు వినిపించాయి. వీరు విడిపోయార‌ని.. విడాకులు కూడా తీసుకున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. రాజీవ్ నుంచి సుమే విడాకులు కావాల‌ని కోరింద‌న్న ప్ర‌చారం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త‌లు టాలీవుడ్‌లోనూ వైర‌ల్ అయ్యాయి. దీనిపై రాజీవ్‌, సుమ‌ స్పందించ‌క‌పోవ‌డంతో అంతా నిజ‌మే అనుకున్నారు. అయితే సుమ చేసిన ఒకే ఒక ట్వీట్ ఈ పుకార్ల‌ను పటాపంచ‌లు చేసింది.

 

 

సుమ త‌న ట్విట్ట‌ర్‌లో రాజీవ్‌పై ఉన్న ప్రేమ‌ను వ్య‌క్తం చేసింది. రాజీవ్‌ను ఎంతో అప్యాయంగా త‌న హృద‌యానికి హ‌త్తు కోవ‌డంతో పాటు ‌నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం అని పోస్ట్ చేసింది. దీనిని బ‌ట్టి వీరు ఎంత అందంగా క‌లిసి మెలిసి ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. ఇక కొద్ది రోజుల క్రిత‌మే సుమ హోస్ట్ చేస్తోన్న ఓ షోకు సైతం రాజీవ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

 

 

సుమ చేసిన ఈ ట్వీట్‌తో వీరు విడిపోయార‌ని వస్తోన్న వార్త‌లు రాసుకున్న గాసిప్ రాయుళ్ల నోటికి తాళం ప‌డిన‌ట్ల‌య్యింది. ఈ కామెంట్ త‌ర్వాత చాలా మంది సూప‌ర్ జంట‌, చూడ‌ముచ్చ‌ని జంట‌, అంద‌మైన జంట అని కామెంట్లు పెడుతున్నారు. ఇంత అంద‌మైన జంట మ‌ధ్య ఎందుకు ఈ రూమ‌ర్లు క్రియేట్ చేస్తారు.. ఇక ఆపండ్రోయ్ అంటూ ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news