Moviesఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

ఈ యేడాది సినిమా ఇండ‌స్ట్రీని వ‌రుస‌గా విషాదాలు వెంటాడుతున్నాయి. ఎంతో మంది ప్ర‌ముఖులు మృతి చెందుతున్నారు. దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత ఎంతో మంది వెండితెర‌, బుల్లితెర న‌టులు చ‌నిపోతున్నారు. గ‌త రెండు రోజులుగ సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్‌రెడ్డి, బుల్లితెర న‌టి శ్రావ‌ణి మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ రోజు మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ తమిళ కమెడియన్ కన్నుమూశారు.

కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న వడివేల్ బాలాజీ(42) మృతి చెందారు. ప్రముఖ కమెడియన్ వడివేలును ఆయన బాగా అనుకరించేవాడు. అందుకే ఆయ‌నకు వ‌డివేల్ బాలాజీ అనే పేరు వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. ఆర్థిక ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డంతో చివ‌ర‌కు గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. చివ‌ర‌కు ఈ రోజు ఉద‌యం ఆయ‌న చెన్నైలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news