Sportsఆ న‌టితో పీక‌ల్లోతు డేటింగ్‌లో ఉన్న క్రికెట‌ర్ పృథ్వీ షా

ఆ న‌టితో పీక‌ల్లోతు డేటింగ్‌లో ఉన్న క్రికెట‌ర్ పృథ్వీ షా

భార‌త క్రికెట్ జ‌ట్టులో యంగ్ ప్లేయ‌ర్‌, తాజా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఉన్న‌‌ పృథ్వీ షా (20) గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఇక ఈ సీజ‌న్లో ఢిల్లీ త‌ర‌పున స‌త్తా చాటేందుకు తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తోన్న ఈ 20 ఏళ్ల యంగ్ త‌రంగ్ నూనుగు మీసాల ద‌శ‌లో ఉండ‌గానే ఓ యువ నటితో పీక‌ల్లోతు డేటింగ్‌లో మునిగి తేలుతున్నాడ‌ట‌. టీవీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన యువ నటితో పృథ్వీ డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్ మీడియా ఒక్క‌టే కోడై కూస్తోంది.

క‌ల‌ర్స్ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఉడాన్ సీరియ‌ల్‌తో పాపుల‌ర్ అయిన ప్రాచీసింగ్‌తోనే పృథ్వీ షా డేటింగ్‌లో ఉన్నాడ‌ట‌. వీరిద్ద‌రు చాలా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న‌ట్టు టాక్‌. ఇక సోషల్‌మీడియాలో వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వీరి డేటింగ్ రిలేషన్ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకరి పోస్ట్‌కు మరొకరు తప్పకుండా కామెంట్లు లేదా ఎమోజీల‌తో వీరు రిప్లే ఇచ్చుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news