Moviesప‌వ‌న్ మాజీ భార్య రేణు తీర‌ని కోరిక ఇదొక్క‌టే... అది ఎప్ప‌ట‌కి...

ప‌వ‌న్ మాజీ భార్య రేణు తీర‌ని కోరిక ఇదొక్క‌టే… అది ఎప్ప‌ట‌కి క‌లే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ప్ర‌స్తుతం ప‌లు షోల‌కు జడ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది తాను కూడా ఇండ‌స్ట్రీలోనూ, మీడియాలోనూ నానుతూనే ఉన్నారు. ప‌వ‌ర్‌స్టార్ మాజీ భార్య‌గా రేణు ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచ‌ల‌నమే. ఇక రేణు ప‌వ‌న్ నుంచి విడిపోయాక ప్ర‌స్తుతం పూణేలో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రే ఉంటోంది. ఇక రేణుకు జీవితంలో ఓ తీర‌ని కోరిక ఉంద‌ట‌. ఆమె సైంటిస్ట్ కావాల‌ని అనుకుంద‌ట‌. చ‌దువుకున్న స‌మ‌యంలో ఆమె యాంబిష‌న్‌గా సెంటిస్ట్ ఉండేదని చెప్పింది.

Went into depression after divorce; Akira hates being called Jr Powerstar: Renu  Desai

అనుకోకుండా మోడ‌లింగ్‌లోకి రావ‌డం… ఆ త‌ర్వాత హీరోయిన్ కావ‌డం.. ప‌వ‌న్ ప‌క్క‌న ఆమె బ‌ద్రి సినిమాలో చేయ‌డం.. చివ‌ర‌కు ఆ ప‌వ‌న్‌కే భార్య కావ‌డం… విడిపోవ‌డం ఇలా అన్ని అనుకోకుండా జ‌రిగిపోయాయ‌ని ఆమె చెపుతారు. రేణు 2000వ సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు సినిమాతో ఆమె హీరోయిన్ అయ్యారు. బద్రి ఇప్ప‌టికే రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అవుతోంది. ఈ క్ర‌మంలో చెరిగిపోయిన తన డ్రీమ్ గుర్తు చేసుకున్న రేణు తాను న‌టిని కావాల‌ని అనుకోలేద‌ని చెప్పింది.

Pawan Kalyan's ex-wife Renu Desai shares a glimpse of her fiancé - Movies  News

సైంటిస్ట్ కాకుండా క‌నీసం డాక్ట‌ర్‌ను అయినా అయ్యి ఉండేదానిని అని చెపుతోంది. విధి మాత్రం త‌న డ్రీమ్ చిదిమేసింద‌ని రేణు వాపోయింది. ఇక నాసా సైంటిస్ట్ కావాల‌నుకున్న త‌న డ్రీమ్‌ను కెమేరా లాగేసింద‌ని కూడా చెప్పింది. త‌న కోరిక ఎప్ప‌ట‌కీ తీర‌ని క‌లే అయ్యింద‌ని చెప్పింది. 16 ఏళ్ల‌కే కెమేరా ముందుకు వ‌చ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news