Gossipsడ్ర‌గ్ కేసులో టాలీవుడ్‌లో ఫ‌స్ట్‌ అరెస్టు అయ్యేది ఆ డైరెక్ట‌రేనా..!

డ్ర‌గ్ కేసులో టాలీవుడ్‌లో ఫ‌స్ట్‌ అరెస్టు అయ్యేది ఆ డైరెక్ట‌రేనా..!

బాలీవుడ్‌లో రియా చ‌క్ర‌వ‌ర్తిని డ్ర‌గ్ కేసులో ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇటు శాండ‌ల్‌వుడ్‌ను కూడా డ్ర‌గ్ ఉదంతం ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్ప‌టికే హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజ‌న‌ల‌ను కూడా అరెస్టు చేశారు. వీరిద్ద‌రికి డ్ర‌గ్స్‌తో లింకులు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి ఇక అటు రియా కూడా ఇప్ప‌టికే అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. వీరు ముగ్గురు టాలీవుడ్ సినిమాల్లో న‌టించారు. వీరిలో రియా తూనీగ తూనీగ సినిమాలో న‌టించింది. రాగిణి ద్వివేది జెండా పై క‌పిరాజు, సంజ‌న ప‌లు సినిమాల్లో న‌టించింది.

ఈ ముగ్గురిలో ఓ హీరోయిన్ టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉంద‌ట‌. ఆ హీరోయిన్ ఆ డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా కూడా చేసింది. అందులోనూ అతను డ్రగ్ యూజర్ అని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆ డైరెక్ట‌ర్‌ను కూడా విచారిస్తారన్న గుస‌గుస‌లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. స‌ద‌రు డైరెక్ట‌ర్‌తో పాటు అత‌డితో క్లోజ్గా ఉండే మ‌రో హీరోయిన్ పేరు కూడా ఈ లిస్టులో ఉందంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news