Gossipsప్లాప్ హీరోయిన్‌కు ప‌వ‌న్ మ‌రో ఛాన్స్‌.. ఆ ముదురు ముద్దుగుమ్మతో రొమాన్స్‌..!

ప్లాప్ హీరోయిన్‌కు ప‌వ‌న్ మ‌రో ఛాన్స్‌.. ఆ ముదురు ముద్దుగుమ్మతో రొమాన్స్‌..!

రీ ఎంట్రీ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఓ వైపు వ‌కీల్‌సాబ్‌, క్రిష్‌, సురేంద‌ర్ రెడ్డి సినిమాల‌తో పాటు హ‌రీష్ శంక‌ర్‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఆ వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో మ‌రో సినిమా ఉంటుందంటున్నారు. వ‌కీల్‌స‌బ్‌లో నివేదా థామ‌స్‌, అంజ‌లి హీరోయిన్లు. క్రిష్ సినిమాలో జాక్వెలైన్ ఫెర్నాండేజ్ పేరు విన‌ప‌డుతోంది.

ఇక ప‌వ‌న్ – హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న సినిమాలో పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఇక ప‌వ‌న్ – సురేంద‌ర్ రెడ్డి కాంబోలో రామ్ తాళ్లూరి నిర్మించే సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరు వినిపిస్తోంది. గతంలో పవన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. అయినా మ‌రోసారి కాజ‌ల్‌కు ప‌వ‌న్ ఛాన్స్ ఇస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

 

మ‌రి ఈ సారి అయినా ప‌వ‌న్ – ఈ ముదురు ముద్దుగుమ్మ‌ కాంబో బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ కొడుతుందేమో ?  చూడాలి. ప‌వ‌న్ త‌న సినిమాలు కంప్లీట్ చేసే లోపు సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక సురేంద‌ర్ – ప‌వ‌న్ సినిమా సెట్స్ మీద‌కు రానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news