Newsయువ‌తిపై బెస్ట్ ఫ్రెండ్సే గ్యాంగ్‌రేప్‌.. న‌మ్మించి ఒక్కొక్క‌రుగా..!

యువ‌తిపై బెస్ట్ ఫ్రెండ్సే గ్యాంగ్‌రేప్‌.. న‌మ్మించి ఒక్కొక్క‌రుగా..!

స‌మాజంలో అమ్మాయిలు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటున్నా కూడా కొంద‌రు వారిని న‌మ్మించి వంచిస్తున్నారు. కొంద‌రు కామాంధులు మాత్రం త‌మ‌తో ఎంత స్నేహంగా ఉంటోన్న అమ్మాయిల‌ను కూడా వ‌ద‌ల‌కుండా లైంగీక దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. యూపీలోని ప్ర‌యోగ‌రాజ్ బెనిగంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువ‌తి స్థానికంగా బ్యుటీషియ‌న్‌గా ప‌నిచేస్తోంది. కొంద‌రు యువ‌కుల‌తో ఆమెకు ప‌రిచ‌యం ఉంది. వీరంతా బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. ఇటీవ‌ల ఓ యువ‌కుడి బ‌ర్త్ డే పార్టీకి ఆమెను పిలిచారు. ఆ త‌ర్వాత ఆమెను సామూహికంగా రేప్ చేశారు.

 

బర్త్ డే పార్టీ ఉంద‌ని సులేం సారాయ్ అనే వ్యక్తి యువతిని ఇంటికి పిలిచాడు. ఆ యువ‌తి పార్టీకి వెళ్లేస‌రికే అక్క‌డికే మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు. కేక్ క‌టింగ్ త‌ర్వాత ఆ యువ‌తి వారితో క‌లిసి మందు పార్టీలో పాల్గొంది. ఆ త‌ర్వాత ఆమె మ‌త్తులోకి జారుకుందో లేదో ?  వారు పాడుబుద్ధి చూపించారు. ఒక్కొక్క‌రు ఆమెపై అత్యాచారం చేశారు. యువతి మత్తు నుంచి తేరుకున్నాక జరిగిన ఘోరం చూసి ఆమె భోరున ఏడ్చేసింది.

 

ఆ వెంట‌నే ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న ఆ యువ‌కులు ప‌రార‌య్యారు. పోలీసులు ప్ర‌ధాన నిందితుడు సులేం సారాయ్‌తో పాటు మిగతావారి కోసం అన్వేషిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news