Newsచైనా కుటిల బుద్ది.. పావురాలు, డాల్పిన్లే కాదు గేదెల‌తోనూ గూఢ‌చ‌ర్యం..!

చైనా కుటిల బుద్ది.. పావురాలు, డాల్పిన్లే కాదు గేదెల‌తోనూ గూఢ‌చ‌ర్యం..!

డ్రాగ‌న్ భార‌త విష‌యంలో తీవ్ర‌మైన గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డుతోంది. మ‌న దేశ ర‌హ‌స్యాలు తెలుసుకునేందుకు జంతువులు, పావురాలే కాకుండా చివ‌ర‌కు గేదెల‌ను సైతం వాడుకుంటున్న‌ట్టు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ జ‌డ‌ల గేదెల మంద చైనా భూభాగం దాటుకుని అరుణాచల్ ప్ర‌దేశ్‌లోకి వ‌చ్చింది. వారం రోజుల త‌ర్వాత మ‌న సైన్యం వాటిని తిరిగి చైనా య‌జ‌మానుల‌కు అప్ప‌గించింది. ఇప్పుడు స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ జడల గేదెలను చైనా గూఢచర్యానికి ఉపయోగించిందేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

జ‌డ‌ల గేదెల‌ను గూఢ‌చ‌ర్యానికి వాడ‌తారా ? అన్న సందేహం ప‌రిశీలిస్తే అవున‌నే అంటున్నాయి నిఘా వ‌ర్గాలు. గత ఏడాది ఏప్రిల్‌లో నార్వే తీరంలో ఓ బెలుగా వేల్‌ను పట్టుకున్నారు. బెలుగా వేల్స్ చాలా తెలివైనవి.ఇవి మ‌నుష్యుల‌తో కూడా స‌న్నిహితంగా ఉంటాయి. ఓ వేల్ మెడ‌లో ఓ ప‌ట్టీ ఉంది. దాని త‌ల‌లో ఓ ఎల‌క్ట్రానిక్ ప‌ర‌కరం కూడా ఉంది. దీనిని ర‌ష్యా ప్ర‌యోగించింద‌న్న సందేహాలు అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  ఇక నీటి అడుగున ఉన్న స‌బ్‌మెరైన్ల‌ను గుర్తించ‌డం కోసం 1960 నుంచే అమెరికా నేవీ డాల్ఫిన్ల‌ను వాడుతోంది.

రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో డాల్ఫిన్లతో రష్యా సబ్‌మెరైన్లపై అమెరికా నిఘా పెట్టింది. ఉక్రేయిన్‌తో రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో డాల్ఫిన్లతో గూడఛర్యం కూడా తెర మీదకు వచ్చింది. ఇక తొలి ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలోనూ అమెరికా సైనికుల మ‌ధ్య కమ్యూనికేష‌న్ల కోసం పావురాలు వాడింది. పెలికాన్ కొంగలతోనూ ఇజ్రాయెల్ గూఢచర్యానికి పాల్పడుతోందని సూడాన్ ఆరోపించింది. ఇక ర‌ష్యా – అమెరికా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ స‌మ‌యంలో జంతువుల‌తో గూఢ‌చ‌ర్యం చేసేందుకు రెండు దేశాలు బాగా ప్ర‌య‌త్నించాయి. ఏదేమైనా ఇప్పుడు ఈ జ‌డ‌ల గేదెల మంద‌ల‌ను కావాల‌నే చైనా భార‌త్‌లోకి వ‌దిలింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news