Healthక‌రోనా రోగులు ఇలా ప‌డుకుంటే ముప్పేనా....!

క‌రోనా రోగులు ఇలా ప‌డుకుంటే ముప్పేనా….!

క‌రోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని బోర్లా ప‌డుకోబెట్టి వెంటిలేట‌ర్ అమ‌రుస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే వీరి శ్వాస ప్ర‌క్రియ మొరుగైనా నాడీ వ్య‌వ‌స్థ‌కు మాత్రం శాశ్వ‌తంగా న‌ష్టం క‌లిగే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ర‌క్త‌ప్ర‌వాహం త‌గ్గ‌డం, ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల ఈ ప‌రిస్తితి తలెత్తుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెపుతున్నాయి. సాధార‌ణ రోగుల్లో వెంటిలేట‌ర్‌పై బొక్క బోర్లా ప‌డుకున్నా నాడులు దెబ్బ‌తిన‌డం అనేది అరుదుగా జ‌రుగుతుంద‌ని.. అయితే క‌రోనా రోగుల విష‌యంలో మాత్రం నాడులు దెబ్బ‌తింటాయ‌న్న విష‌యాన్ని ప‌రిశోధ‌కులు ఆల‌స్యంగా గుర్తించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Visual Guide to Your Nervous System

క‌రోనా వ‌ల్ల తీవ్ర‌స్థాయిలో అనారోగ్యానికి గుర‌య్యి కోలుకున్నాక కూడా కొద్ది రోజుల వ‌ర‌కు బ‌ల‌హీనంగానే ఉంటున్నారు. కొవిడ్‌-19 బాధితుల్లో మణికట్టు, మడమ, భుజం వంటి కీలక భాగాల్లో కీళ్ల వద్ద సమస్యలు ఎక్కువుగా ఉండ‌డంతో పాటు ఈ భాగాల‌న్ని పూర్తిగా ప‌క్ష‌వాతం సోకిన‌ట్టుగా ఉంటున్నాయ‌ట‌. ఇక కోవిడ్‌-19 సోకిన త‌ర్వాత తీవ్ర స్థాయిలో అనారోగ్యం పాలైన వారికి 12 – 15 శాతం నాడులు శాశ్వ‌తంగా దెబ్బ‌తింటున్నాయ‌ని గుర్తించారు.

 

కోవిడ్ బాధితులు బోర్లా ప‌డుకున్న‌ప్పుడు మొడ భాగంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంద‌ట‌. వీరు మామూలు స్థితికి వ‌చ్చాక వీరి నాడి వ్య‌వ‌స్థ‌ను తిరిగి య‌ధాస్థితికి తీసుకువ‌చ్చినా మ‌ధుమేహం ఉన్న‌వారు మాత్రం పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టమే అట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news